NTV Telugu Site icon

Bank Holidays in March 2023 List: మార్చిలో బ్యాంకులకు దండిగా సెలవులు..

Bank Holidays

Bank Holidays

Bank Holidays in March 2023 List: ఫిబ్రవరి ముగింపునకు వచ్చేసింది.. ఇక, మార్చి నెల ప్రారంభం కాబోతోంది.. నిత్యం బ్యాంకులు చుట్టూ తిరుగుతూ లావాదేవీలు చేసేవారు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఎందుకంటే.. ఈ నెలలో ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడున్నాయి.. ఏదైనా అసౌకర్యాన్ని నివారించడానికి, వచ్చే నెలలో రాబోయే బ్యాంక్ సంబంధిత పనులు ఉన్న వ్యక్తులు సెలవు క్యాలెండర్‌ను సమీక్షించి, తదనుగుణంగా వారి బ్యాంక్‌ పనులు ప్లాన్‌ చేసుకుంటే బెటర్‌.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చి 2023 కోసం బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. వివిధ పండుగలు, రెండో శనివారం, నాల్గో శనివారం మరియు నాలుగు ఆదివారాలతో సహా మొత్తం 12 సెలవులు ఉంటాయని పేర్కొంది..

ఇక, బ్యాంకు సెలవులకు సంబంధించిన పూర్తి జాబితా విషయానికి వస్తే..
* మార్చి 3, శుక్రవారం: చాప్‌చార్ కుట్ సందర్భంగా మణిపూర్‌లోని బ్యాంకులు మూసివేయబడతాయి.
* మార్చి 5, ఆదివారం: వారాంతం కారణంగా భారతదేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.
* మార్చి 7, మంగళవారం: హోలీ కారణంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
* మార్చి 8, బుధవారం: ధూలేతి/డోల్యాత్ర/హోలీ/యాయోసాంగ్ 2వ రోజు కారణంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
* మార్చి 9, గురువారం: హోలీ సందర్భంగా బీహార్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
* మార్చి 11, శనివారం: భారతదేశంలోని అన్ని బ్యాంకులు నెలలో రెండవ శనివారం మూసివేయబడతాయి.
* మార్చి 12, ఆదివారం: వారాంతం కారణంగా భారతదేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.
* మార్చి 19, ఆదివారం: వారాంతం కారణంగా భారతదేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.
* మార్చి 22, బుధవారం: గుడి పడ్వా/ఉగాది పండుగ/బీహార్ దివాస్/సాజిబు నొంగ్మపన్బా (చెయిరావోబా)/తెలుగు నూతన సంవత్సర దినోత్సవం/1వ నవరాత్రాల కారణంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
* మార్చి 25, శనివారం: భారతదేశంలోని అన్ని బ్యాంకులు నెలలో నాల్గో శనివారం మూసివేయబడతాయి.
* మార్చి 26, ఆదివారం: వారాంతం కారణంగా భారతదేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.
* మార్చి 30, గురువారం: శ్రీరామ నవమి వేడుకల కారణంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.

అయితే, ఈ సెలవుల్లో కొన్ని ప్రాంతీయమైనవి, కాబట్టి బ్యాంక్ సందర్శనను ప్లాన్ చేయడానికి ముందు సెలవుదినం మీ ప్రాంతానికి వర్తిస్తుందో లేదో చెక్‌చేసుకోవడం మంచిది.. అయితే, ఆన్‌లైన్ మరియు నెట్ బ్యాంకింగ్ సేవలు ఈ రోజుల్లో యథావిథిగా పని చేస్తాయి.. ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ సేవలపైనే ఎక్కువ మంది ఆధారపుడుతోన్న విషయం విదితమే.. అయితే, పెద్ద మొత్తం ఉన్నప్పుడు గానీ, ఇతర బ్యాంకు లావీదేవీల విషయంలో మాత్రం.. సంబంధిత బ్యాంకు బ్రాంచీలకు వెళ్తున్నారు ఖాతాదారులు.