Site icon NTV Telugu

Adani vs Ambani: అదానీ Vs అంబానీ .. 2025 లో ఎవరి సంపద పెరిగిందో తెలుసా!

Adani Vs Ambani

Adani Vs Ambani

Adani vs Ambani: భారతదేశంలోని అత్యంత ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి 2025 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా తన నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకోవడమే కాకుండా, ఈ ఏడాదిలో సంపద అత్యధికంగా పెరుగడంతో బిలియనీర్ కూడా అయ్యాడు. మరోవైపు గౌతమ్ అదానీకి కూడా ఈ ఏడాది చాలా కీలకంగా మారిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరి సంపద పెరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: AP District Reorganization: జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం.. మార్పులు.. చేర్పులు ఇవే..

రిలయన్స్ బలంతో పెరిగిన అంబానీ సంపద ..
2025లో ముఖేష్ అంబానీ సంపద పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లలో పెరుగుదల ప్రముఖ పాత్ర పోషించింది. ఈ సంవత్సరంలో RIL షేర్లు దాదాపు 30% పెరిగాయి. ఈ పెరుగుదల అంబానీ నికర ఆస్తి విలువకు సుమారు $15 బిలియన్లు జోడించాయి. ఈ ఏడాది చివరి నాటికి, ఆయన నికర విలువ $105 – $108 బిలియన్ల మధ్య ఉంటుందని అంచనా. రిలయన్స్ టెలికాం వ్యాపారం, జియో, రిటైల్ రంగం బలమైన పనితీరు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించింది.

2025 లో భవిష్యత్తు సంసిద్ధతకు ముఖేష్ అంబానీ అధిక ప్రాధాన్యతనిచ్చారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రధాన పెట్టుబడులు పెట్టడం, కృత్రిమ మేధస్సుపై దృష్టి సారించి రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనే కంపెనీ ప్రారంభం వంటివి మార్కెట్‌కు సానుకూల సంకేతాలను అందించాయి. ఇంకా 2026 లో రిలయన్స్ జియో IPO గురించి ఊహాగానాలు కూడా పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఇది అంబానీ సంపద పెరగడానికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రేసులో వచ్చిన గౌతమ్ అదానీ..
గౌతమ్ అదానీకి 2025 సంవత్సరం కోలుకునే ఏడాదిగా మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో ఎదుర్కొన్న సవాళ్ల తర్వాత, ఈ ఏడాది అదానీ గ్రూప్‌నకు చెందిన అనేక స్టాక్‌లు తిరిగి బలపడ్డాయి. అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ వంటి స్టాక్‌లలో బలమైన లాభాలు ఆయన సంపదకు సుమారు $14.2 బిలియన్లను జోడించాయి. అయినప్పటికీ గౌతమ్ అదానీ నికర విలువ ఈ సంవత్సరం ముగిసే సమయానికి ముఖేష్ అంబానీ కంటే దాదాపు $92 బిలియన్లు వెనుకబడి ఉంది.

$145 బిలియన్ల పెట్టుబడికి ప్లాన్స్..
అదానీ గ్రూప్ రాబోయే ఆరు సంవత్సరాలలో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన రంగాలలో $145 బిలియన్లను పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రధాన ప్రణాళికను ప్రకటించింది. ఈ ప్రణాళిక భారతదేశ ఇంధన, మౌలిక సదుపాయాల రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలదని అంచనా. ఈ వ్యూహం విజయవంతమైతే గౌతమ్ అదానీ రాబోయే కొన్ని సంవత్సరాల్లో వేగంగా సంపదను కూడబెట్టుకోగలడని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

2025 లో ముఖేష్ అంబానీ భారతదేశంలో మొదటి అత్యంత ధనవంతుడుగా నిలిచి చరిత్ర సృష్టించాడు. రెండవ స్థానంలో గౌతమ్ అదానీ అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వారి ర్యాంకింగ్‌లు కూడా దగ్గరగా ఉన్నాయి, కానీ ఈ ర్యాంకింగ్ అంబానీ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. అయితే గౌతమ్ అదానీ పెద్ద పెట్టుబడి ప్రణాళికలు ఆశాజనకమైన భవిష్యత్తు అవకాశాలను అందిస్తున్నప్పటికీ, 2025 పూర్తిగా ముఖేష్ అంబానీ సంవత్సరంగా మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. రిలయన్స్ బలమైన పనితీరు, కొత్త వ్యాపార రంగాలలో పెట్టుబడులు, మార్కెట్ విశ్వాసం ఆయన్ను భారతదేశ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిపాయని వెల్లడించారు.

READ ALSO: Health Tips: పిల్లల్లో మొబైల్ వ్యసనాన్ని ఈ టిప్స్‌తో దూరం చేయవచ్చు..!

Exit mobile version