Site icon NTV Telugu

Aadhaar Instant Loan: ఆధార్‌ ఉందా.. చిటికెలో రూ.2,000 మీ ఖాతాలోకి! ఎలాగో తెలుసా?

Aadhaar Instant Loan

Aadhaar Instant Loan

Aadhaar Instant Loan: ఆధునిక సాంకేతిక యుగంలో అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఎవరినో అడగాల్సిన పని లేకుండా కేవలం మీ ఆధార్ కార్డ్‌తో డబ్బులను సంపాదించుకోవచ్చు. ఈ విషయం మీకు తెలుసా.. మీ చేతిలో ఆధార్ కార్డు ఉంటే చాలు, చిటికెలో రుణం పొందే అవకాశం ఉంది. అయితే టెక్నాలజీ ఎంత పెరిగిందో, ఆ పేరుతో జరిగే మోసాలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. అందుకే సురక్షితంగా రూ.2,000 వరకు లోన్ ఎలా పొందాలి? దీనికి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Bangladesh: జూలై చార్టర్‌కు 70% బంగ్లాదేశీయుల ఓట్.. అసలు ఏంటి ఇది..?

నిజానికి మార్కెట్లో వందలాది “ఇన్‌స్టంట్ లోన్” యాప్‌లు ఉన్నాయి. కానీ, ప్రతిదీ సురక్షితం కాదనే విషయాన్ని అందరూ గుర్తు ఉంచుకోవాలి. మీరు ఎంచుకున్న యాప్ లేదా బ్యాంక్ కచ్చితంగా RBI (భారతీయ రిజర్వ్ బ్యాంక్) ద్వారా నియంత్రించబడే NBFC (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) అయి ఉండాలి. వాట్సాప్, ఎస్సెమ్మెస్ లేదా సోషల్ మీడియాలో వచ్చే గుర్తుతెలియని లోన్ లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయకూడదు.

ఈ లోన్‌కు కావాల్సిన ఇవే..
మీరు మీ ఆధార్ కార్డు ద్వారా లోన్ తీసుకోవాలంటే, మీకు పెద్దగా పేపర్లు అవసరం లేదు. కేవలం మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి. పాన్ కార్డ్ కావాలి, బ్యాంక్ ఖాతా ఉండాలి.

ఎలా అప్లై చేయాలంటే..

* ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి నమ్మకమైన బ్యాంక్ లేదా NBFC యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

* అందులో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, మొబైల్‌కు వచ్చే OTP ద్వారా e-KYC పూర్తి చేయండి.

* మీ OTPని ఎవరికీ చెప్పకండి. యాప్ స్క్రీన్‌పై మాత్రమే ఎంటర్ చేయండి. అవసరమైతే వీడియో KYC కూడా చేయాల్సి ఉంటుంది.

* లోన్ అప్రూవ్ అయ్యే ముందు Key Fact Statement (KFS) చదవండి. ఇందులో వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, తిరిగి చెల్లించాల్సిన తేదీ స్పష్టంగా ఉంటాయి.

ఈ నియమాలు పాటించకపోతే అవస్థలు తప్పవు జాగ్రత్త..

* వడ్డీ కంటే ‘ప్లాట్‌ఫామ్ ఫీజు’, ‘ప్రాసెసింగ్ ఫీజు’లు ఎక్కువగా ఉండవచ్చు. వాటిని చెక్ చేయండి.

* గడువులోపు డబ్బు కట్టకపోతే పెనాల్టీలు భారీగా ఉంటాయి. ఇది మీ సిబిల్ స్కోర్‌ను కూడా దెబ్బతీస్తుంది.

* ఎప్పుడూ యాప్ ద్వారానే రీపేమెంట్ చేయండి. ఏ వ్యక్తిగత UPI ఐడీలకో డబ్బులు పంపకండి.

గమనిక : ఆధార్ కార్డు ద్వారా లోన్ ఇస్తామని చెప్పి ప్రాసెసింగ్ ఫీజు ముందుగానే కట్టమనే వారందరూ మోసగాళ్లే అనే విషయాన్ని గుర్తుకు ఉంచుకోండి. ఏ నిజమైన బ్యాంక్ కూడా లోన్ ఇవ్వకముందే మీ దగ్గర డబ్బులు వసూలు చేయదు. నిజానికి అవసరానికి ఆధార్ లోన్ తీసుకోవడం మంచిదే, కానీ అది బాధ్యతాయుతమైన సంస్థ నుంచి మాత్రమే తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు చదవకుండా ‘Accept’ బటన్ నొక్కకండి. డిజిటల్ భద్రతను పాటిస్తూ మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోండి.

READ ALSO: 3 in 1 Electric Car: ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన 3-ఇన్-1 ఎలక్ట్రిక్ కారు.. స్మార్ట్ వాచ్ తో కంట్రోల్ చేయొచ్చు!

Exit mobile version