NTV Telugu Site icon

Sivaji : బిగ్ బాస్ శివాజీ రెండో భార్య ఎవరో తెలుసా?

Bbsivaji

Bbsivaji

టాలివుడ్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.. హౌస్ లో పెద్ద దిక్కుగా ఉంటూ శివన్నగా ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.. హీరోగా కన్నా బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు.. ఇప్పుడు బయటకు వచ్చాక కూడా అంతే ఫెమస్ అవుతున్నాడు.. పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా ఉన్నాడు.. తాజాగా ఇంటర్వ్యూలో తన రెండో భార్య గురించి సంచలన విషయాలను షేర్ చేశాడు.. సోషల్ మీడియాలో ఈ విషయం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది..

తనకు రెండో పెళ్ళాం ఉంది అంటూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా షాకింగ్ న్యూస్ వెల్లడించారు. తనకు రెండో పెళ్ళాం ఉంది అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా తన రెండో భార్య గురించి కూడా తెలిపారు. తన రెండో భార్య అనుకుంటే అమ్మాయి మాత్రం కాదు.. మరెవరు అనుకుంటున్నారా.. అదేనండి కాఫీ.. తనకు రెండో భార్య గా చూసుకుంటానని ఒక్కరోజు లేకున్నా కూడా అసలు తట్టుకోలేనని చెప్పుకొచ్చాడు..

బిగ్ బాస్ షో కు వచ్చిన మొదట్లో కాఫీ కావాలి అంటూ పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే.. కాఫీ అంటే చాలా పిచ్చి అందుకే కాఫీని తన రెండో భార్య అని చెబుతున్నాను అంటూ ఈయన కాఫీ అంటే ఎంత ఇష్టం ఉందనే విషయాన్ని తెలిపారు.. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా ఈయన కాఫీ కోసం పెద్ద ఎత్తున గొడవ పడిన సంగతి తెలిసిందే. ఇలా తనకు మరో భార్య ఉంది అంటూ శివాజీ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం శివాజీ ఇంటర్వ్యూలిస్తూ పాపులర్ అవుతున్నాడు..