బిగ్ బాస్ హాట్ బ్యూటీ అషురెడ్డి పేరుకు పరిచయాలు అవసరం లేదు… డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది… ఇప్పటికే పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. తన అందం, యాట్టిట్యూడ్ తో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది.. అక్కడ కూడా హాట్నెస్ తో యూత్ ను ఆకట్టుకుంది.. ఈమధ్య బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..తాజాగా ఈ అమ్మడు పేరు మార్చుకున్నట్లు తెలుస్తుంది..
చాలా మంది యాక్టర్స్ పేరు కలిసి రావడం లేదని పేరు మార్చుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.. తమ పేరులో ఒక అక్షరం మార్చుకోవడం సహజం. అలాగే అషు కూడా తనకు కలిసి రావాలని పేరు మార్చుకున్నట్లు తెలుస్తుంది.. ఈ విషయాన్ని స్వయంగా అషు నే సోషల్ మీడియా ద్వారా తెలిపింది.. తన ఇంగ్లీష్ పేరులో ఒక లెటర్ చేర్చుకుంది.. ఇంగ్లీష్ లో Ashu Reddy అని రాసేది. ఇప్పుడు Aashu Reddy అని రాస్తుంది.. ఈ పేరు మార్పుతో అన్నా అమ్మడు కేరీర్ మారుతుందేమో చూడాలి..
ఇక బిగ్ బాస్ చాలా మందికి మంచి లైఫ్ ఇచ్చింది.. అలాగే ఈ అమ్మడుకు కూడా.. యూట్యూబ్, టీవీ షోలు, యాంకర్ గా, నటిగా.. ఇలా ఏ అవకాశం వస్తే అది చేసుకుంటూ వెళ్తుంది. ఇక సోషల్ మీడియాలో అయితే రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.. అయితే సినిమాల్లో గట్టిగా పాగా వేసేందుకు ట్రై చేస్తుంది. అందుకే గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. అందాల గేట్లు ఎత్తేసింది.. తాజాగా ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పుడు పేరు మార్పుతో ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి…