బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చెయ్యడానికి కారకూడని అతన్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలుకు రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.. ఈ విషయం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు స్పందిస్తూ వస్తున్నారు.. తాజాగా సీరియల్ నటి ప్రియాంక జైన్ స్పందించారు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ .. ఆ రోజు రాత్రి జరిగిన దాడిపై మండిపడింది. అభిమానం పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేయడం చాలా దారుణం. మేము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కార్లను కొంటాము. వాటిని ఇలా క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. అభిమానం చూపించవచ్చు. నచ్చని వారిని వ్యతిరేకించవచ్చు. కానీ ఇలా దాడులు చేయడం దుర్మార్గం. అమర్ దీప్ కారుపై అటాక్ చేశారు. లోపల వాళ్ల ఫ్యామిలీ లేడీస్ ఉన్నారనే జ్ఞానం కూడా లేకుంటే ఎలా అంటూ దాడికి పాల్పడిన వారిపై మండిపడింది..
శివాజీ, యావర్, అమర్, ప్రశాంత్, తనకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రియాంక పేర్కొంది. అందరం చాలా బాగా క్లోజ్ అయ్యాం. పల్లవి ప్రశాంత్ తో మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అంటూ ప్రియాంక జైన్ కితాబిచ్చింది. ఈ ఇంటర్వ్యూ జరిగే సమయానికి ప్రశాంత్ అరెస్ట్ కాలేదు. దీనితో అరెస్ట్ గురించిన ప్రశ్నలు ఇంటర్వ్యూలో ఎదురుకాలేదని తెలుస్తుంది.. ఇక ప్రశాంత్ ను విడుదల చెయ్యాలని కుటుంబ సభ్యులు, సన్నిహితులు డిమాండ్ చేస్తున్నారు..