Site icon NTV Telugu

Pallavi Prashanth: బిగ్ బ్రేకింగ్..పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు..

Pallavi Prashanth Images

Pallavi Prashanth Images

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 విజేత పల్లవి ప్రశాంత్‌కు ఊరట లభించింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్ గూడా జైలుకు తరలించారు.. అయితే బెయిల్ కోసం అప్లై చేసుకున్న ప్రశాంత్ కు మొదట నిరాశ కలిగింది.. ఇప్పుడు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది..

అయితే ప్రశాంత్‌కు కోర్టు షరతుల తో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా రూ. 15 వేల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని తెలిపింది. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే కేసులో ఉన్న ఏ1 నుంచి ఏ4 వరకు కోర్టు బెయిల్ ఇచ్చింది. అలాగే పల్లవి ప్రశాంత్ మీడియా తో మాట్లాడొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది…

Exit mobile version