స్టార్ మా టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు.. ఇప్పటివరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఎనిమిదో సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది.. ఏడో సీజన్ విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు.. భారీగా రెమ్యూనరేషన్ ను అందుకున్నాడు.. తాజాగా ఓ నెక్లేస్ను కూడా అందుకున్నాడు.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఏడో సీజన్ బిగ్ బాస్ విన్నర్ ను ప్రకటించే సమయంలో తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఒక ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ రూ. 15 లక్షల విలువైన బంగారం కూడా బహుమతిగ ఇస్తామని ప్రకటించింది.. అయితే బిగ్ బాస్ అయ్యి ఐదు నెలలు అయ్యాక ఇప్పుడు అక్షయ తృతీయ నాడు పల్లవి ప్రశాంత్ కు ఆ నగను అందజేశారు.. ఆ ఆనందాన్ని తట్టుకోలేక పోయిన ప్రశాంత్ అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు..
షోలో అమ్మకు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పిన రైతు బిడ్డ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు.. బిగ్ బాస్ షో ముగిసిన ఐదు నెలల తర్వాత గోల్డ్ ఛైన్ ను పల్లవి ప్రశాంత్ కు అందించడం గమనార్హం. ఈ సీజన్ ముగిసిన తర్వాత బుల్లితెరపై బాగానే సందడి చేస్తున్నాడు పల్లవి ప్రశాంత్.. శివాజీ తో కలిసి ఈవెంట్స్ కు కూడా హాజరవుతున్నాడు.. ఇటీవల ఓ రైతుకు ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే..
