NTV Telugu Site icon

Inaya Sultana : వేణు స్వామితో బిగ్ బాస్ బ్యూటి.. పాప కూడా దానికోసమేనా?

Inaya Venu Swamy

Inaya Venu Swamy

బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినిమాల్లో తక్కువగా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది.. తాజాగా వివాదాస్పద వేణు స్వామి తో దిగిన ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఈరోజుల్లో కూడా చాలా మంది పూజలు, పునస్కారాలతో తమ జీవితాలు మారిపోతాయని నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు.. సినీ ఇండస్ట్రీలో అయితే సినిమా మొదలు పెట్టడం దగ్గర నుంచి సినిమా విడుదల వరకు ముహూర్తం చూసి చేసేవాళ్లు కొందరైతే.. మరికొందరు టైటిల్స్ , కాంబినేషన్స్, విడుదల తేదీలను గుడ్డిగా నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇక జ్యోతిష్యులు, మంత్రగాళ్ళతో ప్రత్యేక పూజలు చేయించుకునే బ్యాచ్ ఉంది. కాగా కెరీర్లో ఎదగాలని వేణు స్వామిని సందర్శిస్తూ ఉంటాడు..

ఈయన చాలా మంది సెలెబ్రేటీలకు జ్యోతిష్యం చెబుతుంటారు.. లక్షలు ఖర్చు చేసి ఆయనతో పూజలు చేయించుకుంటారు. రష్మిక మందాన, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి తో పాటు చాలా మంది హీరోయిన్ లు పూజలు చేయించుకున్నారు.. ఆ లిస్ట్ లో ఇప్పుడు బిగ్ బాస్ ఫెమ్ ఇనయా సుల్తానా చేరింది.. వేణు స్వామి బర్త్ డే నేపథ్యంలో అతనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. ఆయనతో కలిసి దిగిన, పూజలు జరిపించుకున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది.. దీంతో ఈ అమ్మడు కూడా ఆయన భక్తురాలా? అలా పూజలు చేసినందుకే ఇప్పుడు సినిమాల్లో నటిస్తుందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

Show comments