NTV Telugu Site icon

BiggBoss7 Telugu : హౌస్ లో రెచ్చిపోతున్న రతిక.. ప్రశాంత్ అంటే అంత ప్రేమా?

Bb (2)

Bb (2)

బిగ్ బాస్ సీజన్ తెలుగు 7 ఇప్పుడు మూడోవారం నామినేషన్స్ కోసం నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది.. గతంలో కన్నా ఈ సారి లవ్ స్టోరీలు ఎక్కువ అయ్యాయి..ప్రస్తుతం పవర్ అస్త్రాలు వేట సాగుతోంది. ఈ వారం మూడవ పవర్ అస్త్ర టాస్క్ లు జరగబోతున్నాయి.. మంగళవారం రోజు మూడవ పవర్ అస్త్రకి సంబంధించిన అంశంలో కీలక ప్రక్రియ మొదలయింది. బిగ్ బాస్ కంటెండర్స్ ని ఎంపిక చేశారు. శివాజీ, రతిక గుసగుసల తో నేటి ఎపిసోడ్ మొదలైంది. అంతా నాగురించే చెడుగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా నా ఎక్స్ గురించి అంటూ రతిక శివాజీ వద్ద వాపోయింది. అలా మాట్లాడే వారిని ఏం పీక్కుంటారో పీక్కోమను. మనం వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదు. స్ట్రాంగ్ గా ఉండాలి అంటూ శివాజీ రతికకి సలహా ఇచ్చారు..

అనంతరం హౌస్ లో వినాయక చవితి సెలెబ్రేషన్స్ జరిగాయి.. పూజ తర్వాత మూడవ పవర్ అస్త్ర కంటెండర్స్ గా అర్హత సాధించిన వారి పేర్లని ప్రకటించారు. తన పరిశీలన ద్వారా ఇన్ని రోజుల ఆట ద్వారా కంటెండర్స్ ని ఎంపిక చేసినట్లు బిగ్ బాస్ తెలిపారు. అమర్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ మూడవ పవర్ అస్త్ర కంటెండర్స్ గా నిలిచినట్లు ప్రకటించారు. తనకి కంటెండర్ గా అవకాశం రాకపోవడంతో ప్రశాంత్ కన్నీరు మున్నీరుగా ఏడ్చేశాడు. బిగ్ బాస్ గెలుస్తానని నమ్మకం పోయినట్లు బిగ్ బాస్ ముందు వాపోయాడు..

ఆ తర్వాత ప్రశాంత్ ను పిలిచి ముగ్గురిలో కంటెండర్ గా అర్హత లేనిది ఎవరికి అని నీవు భావిస్తున్నావు అని ప్రశ్నించాడు. దీనితో ప్రశాంత్ శోభా శెట్టి పేరు చెప్పాడు. ప్రియాంక.. అమర్ డీప్ పేరు చెప్పింది. తేజ, దామిని, రతిక.. యావర్ కి కంటెండర్ గా అర్హత లేదని తమ అభిప్రాయాన్ని తెలిపారు.. ఆ తర్వాత చిన్న విషయంలో రతిక, ప్రశాంత్ మధ్య వచ్చిన గొడవ హౌస్ లో ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇద్దరూ కాసేపు తిట్ల పురాణం అందుకుని ఒకరిని ఒకరు దూషించుకున్నారు. చూస్తుంటే వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండేలా లేరు అనిపిస్తోంది.. ఈ గొడవ కూడా చూపరులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇక ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి..

Show comments