NTV Telugu Site icon

Bigg Boss Telugu : బిగ్ బాస్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇకమీదట షో లేనట్టేనా?

Bb Host Nagarjuna

Bb Host Nagarjuna

తెలుగులో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ అంటే చాలా మంది జనాలు ఇష్టంగా చూసేవారు.. ఒకరిపై అభిమానాన్ని పెంచుకుంటూ వాళ్లు గెలవాలని కోరుకొనేవారు.. టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్.. ఈ క్రమంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 కి ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు హల్చల్ చేశాయి. త్వరలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ప్రసారం అవుతుందనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా రద్దయినట్లు వార్తలు వస్తున్నాయి..

గతంలో ఎన్నడు లేని విధంగా బిగ్ బాస్ 7 లో కామన్ మ్యాన్ విన్నర్ గా నిలవడంతో జనాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.. బిగ్ బాస్ తెలుగు 7 సక్సెస్ నేపథ్యంలో ఓటీటీ వెర్షన్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యిందని, కొందరు సెలెబ్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. బర్రెలక్క, భోలే షావలి, నయని పావనితో పాటు మరికొందరు పార్టిసిపేట్ చేస్తున్నట్లు ఆ మధ్య పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి..

ఫిబ్రవరి నుండి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రారంభం కానుందన్నారు. అయితే అనూహ్యంగా షో రద్దు అయ్యిందట. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ వేయడానికి నిర్ణయించిన ప్రదేశం కూడా వేరే ఛానల్ మరో షోకి బుక్ చేసుకుందట… దానికోసమే ఆ షో సెట్ ను పీకేసి వాళ్ల సెట్ ను వేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తానికి ఈ మధ్య జరిగిన పరిణామాల వల్ల బిగ్ బాస్ ఇక ఉండదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..