NTV Telugu Site icon

Bigg Boss Aswini : నల్లగా ఉన్నా పర్లేదు కానీ ఆ ఒక్కటి ఉంటే చాలు.. పెళ్లి చేసుకుంటాను..

Ashwini Sree

Ashwini Sree

బిగ్ బాస్ ఫేమ్ అశ్విని గురించి ప్రత్యేక అశ్విని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి 12 వ వారం వరకు రాణించింది.. ఐదు వారాల అనంతరం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి అర్జున్, అశ్విని శ్రీ, భోలే, నయని పావని, పూజ మూర్తిలను హౌస్లోకి పంపారు.. తాను ఏం మాట్లాడుతుందో పెద్దగా అర్థం కాకపోవడంతో జనాలు ఎక్కువగా ఆదరించలేకపోవడంతో ఎలిమినేట్ అయ్యింది..

అశ్వినిశ్రీ కంటెస్టెంట్ భోలే షావలితో స్నేహం చేసింది. ఎక్కువగా అతనితో ఉండేదుకు ఇష్టపడేది. భోలే షావలి 10వ వారం ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత ఆమె యావర్, పల్లవి ప్రశాంత్ లతో స్నేహం చేసింది. కాగా అశ్విని శ్రీ 11వ వారం సెల్ఫ్ నామినేట్ చేసుకుంది… ఇక 12వ వారం డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా… ఎవరినీ నామినేట్ చేయకుండా సెల్ఫ్ నామినేట్ అయ్యింది. అది ఆమెకు మైనస్ అని చెప్పాలి. రతిక రోజ్, అశ్వినిశ్రీ 12వ వారం ఎలిమినేట్ అయ్యారు.. ఆ తర్వాత ఆమె నటించిన సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది..

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అశ్విని తనకు కాబోయే భర్త గురించి సంచలన విషయాలను బయటపెట్టింది.. అమ్మడు మాట్లాడుతూ.. నాకు కాబోయేవాడికి ఆస్తి పాస్తులు లేకపోయినా పర్లేదు, నేను చూసుకుంటాను. నల్లగా, దరిద్రంగా, అందవిహీనంగా ఉన్నా పర్లేదు. ఒక్క క్వాలిటీ ఉంటే చాలు పెళ్లి చేసుకుంటాను. అతనికి మంచి మనసు ఉండాలి. నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవాడు దొరికితే వెంటనే పెళ్లిచేసుకుంటాను అని చెప్పింది.. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అమ్మడు మనసుకు నచ్చిన వరుడు ఎవరో చూడాలి..