భక్తులను అనుగ్రహించే కొండంత దేవుడు హనుమంతుడు. ఈమధ్యకాలంలో భక్తులు హనుమాన్ దీక్షలు ఎక్కువగా తీసుకుంటున్నారు. హనుమాన్ మందిరంలో అర్చక స్వాముల సమక్షంలో స్వీకరించి 41 రోజుల పాటు కలశ ఆరాధన చేసి కఠినమైన మండలదీక్షను ప్రారంభించాలి. దీక్షాపరులు ఉదయం 4 గంటలకు లేని ప్రాతఃకాల ప్రార్థన చేసుకొని పీఠ పూజను చేసి అనంతరం పండ్లు పాలతో అల్పహారం తీసుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలకు బిక్ష చేస్తారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రి పూట. పూజను నిర్వహించాలి.
అనంతరం దీక్షాస్వాములు వారి వారి ఇండ్లలో పీఠ పూజను చేసుకొని భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి . దీక్ష విరమణ అయినంత వరకు కల్షంలోని కొబ్బరిని తీసుకొని గుమ్మానికి కట్టుతారు. పీఠం మీద ఉన్న బియ్యాన్ని వండుకొని బిక్ష చేయడం ఆచరిస్తారు. హనుమాన్ దీక్ష దీనిని నిత్య జీవితంలో పాటిస్తే కుటుంబాలు బాగా ఉంటాని మనిషి జీవితంలో పురోగతి ఉంటుందని నమ్మకం. హనుమాన్ దీక్ష తీసుకోవడం వల్ల జీవితంలో క్రమశిక్షణ అలవడుతుంది.