Site icon NTV Telugu

Thursday : గురువారం ఇలా పూజలు చేస్తే.. బాబా అనుగ్రహం పొందుతారు..

Baba

Baba

గురువారం బాబాకు చాలా ప్రత్యేకమైన రోజు.. అందుకే గురువారం చాలా మంది బాబాను ప్రత్యేకంగా పూజిస్తారు..అలాగే గురువారం రోజు సాయిబాబాను దర్శించుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు..అందుకే సాయిబాబాను విశ్వసించేవారు ఆయనను పూజించడమే కాకుండా ఆయన అనుగ్రహం పొందేందుకు ఉపవాసం కూడా పాటిస్తూ ఉంటారు. సాయిబాబాను హృదయపూర్వకంగా ఆరాధిస్తే తన భక్తులు కోరిన కోరికలను తీరుస్తాడని చాలామంది ప్రజలు నమ్ముతారు..

బాబాను మంచి మనసుతో ఆరాధిస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. ఎప్పుడూ కులం, మతం, జీవుల మధ్య వివక్షతను చూపలేదు. ఎవరైతే భక్తితో సాయిబాబా అని పిలిస్తే తన భక్తులను చేరుకుంటాడని ప్రజలు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా గురువారం రోజు ఉపవాసం ఉండడం వల్ల సాయిబాబా అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు..

ఇకపోతే సాయిబాబాను పూజించాలంటే ముందుగా గురువారం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి అభ్యంగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సాయిబాబాను ధ్యానించాలి. అలాగే గురువారం రోజు ఉపవాస దీక్షను చేపట్టాలి. శరీరం మనసు స్వచ్ఛంగా ఉండేలా చూసుకొని సాయిబాబా విగ్రహం ప్రతిష్టించి దానిపై గంగాజలం చల్లాలి. విగ్రహం పై పసుపు రంగు వస్త్రాన్ని కచ్చితంగా ఉంచాలి.. ఆ తర్వాత పూలు, అక్షింతలు కూడా తీసుకోవాలి.. బాబా నామస్కరణ చేస్తూ బాబాకు పూజలు చెయ్యాలి.. బాబా కథను చదవాలి.. సాయిబాబా పూజకు పసుపు రంగు శుభప్రదంగా పరిగణిస్తారు. అందుకే బాబాకు పసుపు మిఠాయిలను మాత్రమే సమర్పించాలి. పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టిన మిఠాయిలు ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి.. బాబా అనుగ్రహం మీకు లభిస్తుంది..

Exit mobile version