NTV Telugu Site icon

Thursday : బాబాకు ఇలా పూజ చేస్తే చాలు.. కోరికలు వెంటనే నెరవేరుతాయి..

Baba

Baba

గురువారం అంటే సాయిబాబా.. ఈరోజు అంటే బాబాకు చాలా ఇష్టం… అందుకే బాబా భక్తులు ఈరోజు ప్రత్యేక పూజలు జరిపిస్తారు.. అయితే బాబాకు ఇలా ప్రత్యేకంగా పూజలు చెయ్యడం వల్ల కోరికలు వెంటనే నెరవేరుతాయని పండితులు చేస్తున్నారు.. ఎలా పూజలు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గురువారం రోజున సాయి బాబా దేవాలయానికి వెళ్లి సాయి బాబాకు పూజలు నిర్వహించడంతో పాటు గురువారం ఉపవాసం ఉండి భక్తితో పూజిస్తే ఎంతో మంచిది. గురువారం రోజు ఉదయం నిద్ర లేచి తలస్నానం చేయాలి.. పరిశుభ్రమైన బట్టలను ధరించాలి.. ఆ తర్వాత ఉపవాసం ఉండటం మంచిది.. పూజ గదిని దూప దీపాలతో నింపి పూజలు చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి..

ఈ విధంగా ప్రతి గురువారం 19 వారాలు పూజలు చెయ్యాలి.. అయితే నియమ నిష్టల తో పూజలు చెయ్యడం.. పసుపు రంగు బట్టలు కట్టుకొని చెయ్యడం మంచిది.. విగ్రహాన్ని గంగాజలంతో శుభ్రం చేసి దాని పై పసుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి.అలాగే ప్రసాదంగా లడ్డూ లేదా పాలతో తయారు చేసిన వాటిని నైవేద్యంగా సమర్పించి వాటిని అందరికీ పంచి పెట్టాలి.. ఆకలితో ఉన్న పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలి.. ఇలా తొమ్మిది రోజుల పాటు చేస్తే ఉపవాసం ఉండాలి. తొమ్మిదవ రోజు పూజ చేసేటప్పుడు ఏమైనా తప్పులు జరిగితే క్షమించమని ఆయనను భక్తితో వేడుకోవాలి. చిన్న పిల్లలను ఇంటికి పిలిచి ఆ ప్రసాదాన్ని పంచాలి.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఉపవాసం చేస్తున్న సమయంలో కఠినంగా చెయ్యాలి అప్పుడే బాబా అనుగ్రహం కలుగుతుంది..

Show comments