Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం

Temple

Temple

హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఒక పురాతనమైన, మహిమాన్వితమైన కొండపై వెలసిన స్వయంభూ బ్రహ్మసూత్ర శివలింగ క్షేత్ర విశేషాలు వెలుగులోకి వచ్చాయి. ‘తెలంగాణ శ్రీశైలం’గా భక్తులు ఆరాధించే ఈ 1500 ఏళ్ల నాటి ప్రాచీన ఆలయ స్థలపురాణం, వీరభద్ర స్వామి ఆవిర్భావం , ముచుకుందా నదికి సంబంధించిన ఆధ్యాత్మిక రహస్యాలను వివరంగా చూద్దాం..

హైదరాబాద్ నగర కోలాహలానికి దూరంగా, ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అత్యంత ప్రాచీనమైన కొండపై శివయ్య స్వయంభూగా వెలిసిన అద్భుత క్షేత్రం ఆధ్యాత్మిక ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దాదాపు 1500 సంవత్సరాల సుదీర్ఘమైన హిస్టరీ కలిగిన ఈ ఆలయాన్ని స్థానికులు , భక్తులు ఎంతో నిష్టతో “తెలంగాణ శ్రీశైలం” అని పిలుచుకుంటారు. ఇక్కడి ప్రధాన దైవం స్వయంభూ బ్రహ్మసూత్ర శివలింగం. ప్రాచీన కాలంలో అనేకమంది మునులు, మహర్షులు ఈ కొండపై ఘోరమైన తపస్సు ఆచరించి, పరమశివుడిని , ఆయన రౌద్ర అవతారమైన వీరభద్ర స్వామిని ప్రత్యక్షం చేసుకున్నారని ఆలయ స్థలపురాణం స్పష్టం చేస్తోంది.