Sravana Masam 2024: మూడు నెలలుగా మూఢంతో నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు సందడి నెలకొంది. ఈ మాసంలో చాలా పండుగలు కూడా రానున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో శ్రావన శోభ సంతరించుకుంది. నేటి (సోమవారం) నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇప్పటికే పలువురు సన్నద్ధమవుతున్నారు. శుక్ర మౌఢ్యం, ఆషాడం, గురు మౌఢ్యం కారణంగా మూడు నెలల పాటు ఆగిపోయిన శుభ కార్యక్రమాలు శ్రావణ మాసంలో జరుగుతాయి. శ్రావణ మాస ముహూర్తాలకు పురోహితులు, బ్యాండ్ మేళం, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, ప్రింటింగ్ ప్రెస్, కిరాణా, పండ్లు, పూలు, క్యాటరింగ్, నగల వ్యాపారులు మూడు నెలలుగా ఖాళీగా ఉన్న వారంతా ఇప్పుడు బిజీ కానున్నారు.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కాగా.. శ్రావణ మాసంలో వచ్చే పండుగలకు చాలా ప్రత్యేకత ఉంది. శ్రావణమాసంలో పండుగలు ఇలా ఉన్నాయి.. నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో.. 8వ తేదీన నాగుల చవితి, 9న నాగులపంచమి, 16న వరలక్ష్మీ వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి ఉన్నాయి. అలాగే ఇవాళ (5వ తేదీ)న మొదటి సోమవారం 12, 19, 26 తేదీల్లో సోమవారాల్లో శివుడిని, 9, 16, 23, 30వ తేదీల్లో (శుక్రవారాలు) లక్ష్మీ దేవిని, 10, 17వ తేదీల్లో విష్ణుమూర్తిని పూజిస్తారు. 24,31వ తేదీల్లో (శనివారాలు). ఈ తేదీల్లో వచ్చే పండుగలతో అన్ని ఆలయాలు పూజా కార్యక్రమాలతో కళకళలాడుతున్నాయి.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
నేటి నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం సెప్టెంబర్ 3వ తేదీతో ముగియనుండగా.. ఈ నెల 31లోగా శుభకార్యాలు ముగించుకోవాలని సూచిస్తున్నారు అర్చకులు. ఈ నెల 7, 8, 9, 10, 11, 15, 16, 17, 18, 21, 22, 23, 24, 28 తేదీల్లో వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయని చెప్పారు. మూడు నెలల నుంచి ఎదురుచూసిన వారంతా ఈ శుభ ముహూర్తాల్లో తమకు అనుకూలమైన తేదీలను నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ నుంచి జూలై 6వ తేదీ ఆషాఢ శుద్ధ పాడ్యమి వరకు శుక్రమౌఢ్యమి. ఇది ఇలా ఉండగా మే 5వ తేదీ నుంచి గురు మౌఢ్యం ప్రారంభమైంది. మూడు నెలలుగా ఎలాంటి శుభ కార్యక్రమాలు లేకపోవడంతో వారిపై ఆధారపడిన వృత్తి, వ్యాపారులు ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు. మండపాలు, పూజారులు చేసే వారి నుంచి మొదలుకొని శ్రావణ మాసం వచ్చేసరికి అంతా బిజీ కానున్నారు.
Srisailam Temple: శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు