హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు ఎంత మహిమ గలవారో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే..అమ్మవారిని రోజుకు వేల మంది భక్తులు దర్శించుకొని కోరికలను కోరుకుంటున్నారు.. కోరిన కోరికలు తీర్చే అమ్మగా భక్తుల పూజలను అందుకుంటుంది పెద్దమ్మ తల్లి.. నవరాత్రులు సందర్బంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో ప్రజలకు దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి ప్రత్యేక దర్శనం కోసం భక్తులు వస్తున్నారు.. ప్రతి ఏటా తక్కువ మంది వస్తే ఈ ఏడాది భారీగా జనం వస్తున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు.. పది లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు తెలుస్తుంది..
అమ్మవారు 15 నుంచి 23 వరకు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తి నిష్టలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తారు. నైవేద్యాలు పెడతారు నిన్న అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు.. ఈరోజు గజలక్ష్మి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు.. ఈ అవతారంలో అమ్మవారికి ప్రత్యేకత ఉంది..
ఈ రోజు అమ్మవారు సరస్వతి దేవి అలంకరణ లో దర్శనం ఇవ్వబోతున్నారు.. తెలుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు. గులాబీలు, తెల్ల చామంతులతో అమ్మవారిని పూజిస్తే మంచిది. అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగలి నైవేద్యం పెడతారు. 9 రోజులు పూజ చేయడానికి వీలు లేని వారు ఈరోజు పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈరోజు పుస్తకాలు దానం చేస్తే విద్యా ప్రాప్తి కలుగుతుంది.. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మీకు దక్కుతాయి.. ఈరోజు కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు..
