Astrology : కన్యలోకి బుధుడు.. ఈ 5 రాశులకు భద్ర రాజయోగం.!

  • సెప్టెంబర్ 7న కన్యారాశిలోకి బుధుడి ప్రవేశం
  • భద్ర మహాపురుష రాజయోగంతో ఊహించని లాభాలు
  • ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలకు సంకేతాలు
  • ఆర్థికంగా ఈ 5 రాశులకు కలిసొచ్చే సమయం
Astrology

Astrology

Astrology : జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మేధస్సు, వాక్చాతుర్యం, తర్కం, వ్యాపారం, గణితం , కమ్యూనికేషన్ రంగానికి బుధుడే అధిపతిగా వ్యవహరిస్తాడు. పంచాంగ గణన ప్రకారం, సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. కన్యారాశిలో బుధుడు అత్యంత బలమైన స్థానంలో అంటే ఉచ్ఛ స్థితిలో ఉంటాడు. కేంద్ర స్థానాల్లో బుధుడు బలంగా ఉన్నప్పుడు ‘భద్ర మహాపురుష రాజయోగం’ ఏర్పడుతుంది. ఈ రాజయోగ ప్రభావంతో ముఖ్యంగా కన్య, మిథున, మకర, కుంభ , తులా రాశుల వారికి వృత్తి, వ్యాపారం , ఆర్థిక రంగాల్లో సంచలన మార్పులతో పాటు ఊహించని శుభఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఈ సంచార సమయంలో బ్యాంకింగ్, రైటింగ్, మీడియా, ఐటీ, అకౌంటింగ్, కమ్యూనికేషన్స్ , విద్యా రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

కన్యా రాశి , మిథున రాశి ఫలితాలు

బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలోనే సంచరిస్తున్నందున ఈ కాలం కన్యారాశి వారికి అత్యంత శుభప్రదంగా మారనుంది. మీలో ఆత్మవిశ్వాసం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి. కార్యాలయాల్లో మీ బాధ్యతలు పెరగడంతో పాటు కీలకమైన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేసి ప్రశంసలు పొందుతారు. నిలిచిపోయిన వ్యాపార పనులు ఊపందుకుని, కొత్త వ్యాపార విస్తరణకు , ప్రాజెక్టుల ప్రారంభానికి ఇది అనుకూల సమయంగా మారుతుంది. ఇక మిథున రాశికి బుధుడే అధిపతి కావడం వల్ల ఈ గోచారం విశేష లాభాలను తెచ్చిపెడుతుంది. మీ తెలివితేటలు, నైపుణ్యాలను నిరూపించుకోవడానికి సరైన వేదిక దొరకడమే కాకుండా ఆఫీసులో మీ సలహాలకు, అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలతో పాటు కొత్త క్లయింట్లు లభించి, సరైన ఆర్థిక ప్రణాళికలు పాటిస్తే మంచి పురోగతి సాధిస్తారు.

మకర రాశి , కుంభ రాశి ప్రయోజనాలు

మకర రాశి వారికి బుధుడి మార్పు వల్ల అదృష్టం తోడై ఉన్నత విద్య , వృత్తిపరంగా మంచి పురోగతి లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ప్రయాణాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడి వ్యాపారంలో లాభాలు అందుతాయి, ఉద్యోగులకు ప్రమోషన్ లేదా హోదా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు కుంభరాశి వారికి భవిష్యత్తు ప్రణాళికలు , ఆర్థిక పురోగతి పరంగా ఇది అత్యంత కీలకమైన సమయం. కొత్త ఉద్యోగం లేదా కెరీర్ మారాలనుకునే వారికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. పారిశ్రామికవేత్తలు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తే ఆదాయం పెరుగుతుంది, అయితే పెద్ద మొత్తంలో నష్టభయం ఉన్న పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.

తులా రాశి ఫలితాలు..

తులా రాశి వారికి కన్యా బుధ సంచారం అనుకూల ఫలితాలను అందిస్తుంది. మీ మాటతీరు, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పని ప్రదేశంలో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అదనపు బాధ్యతలు రావడం వల్ల భవిష్యత్తులో ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, అలాగే కొత్త ఒప్పందాలు ఖరారవుతాయి. ఈ సంచార ప్రభావం వల్ల ఈ ఐదు రాశుల వారి జాతకాలు అనుకూలంగా మారనున్నాయి.

(గమనిక: ఈ కథనం కేవలం జ్యోతిష్య విశ్వాసాలు, సాధారణ గ్రహ సంచార గణనలపై ఆధారపడి రాయబడింది. వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహాల స్థానాలు, దశ-భుక్తులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.)