ఐశ్వర్యవంతులు అవ్వాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి.. ఆమె అనుగ్రహం పొందాలని చాలా మంది ప్రత్యేక పూజలు చేస్తారు..అయినప్పటికీ ఫలితం కనిపించక దిగులు చెందుతూ ఉంటారు. అంతేకాకుండా చేసిన పూజలకు పరిహారాలకు లక్ష్మీదేవి అనుగ్రహించిందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అన్నది తెలియక తికమకపడుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తే వాటి అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే అంటున్నారు పండితులు. మరి ఎలాంటి సంకేతాలు కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిట్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కోయిల కూసే దిశల ఆధారంగా శభ్ధాల ఆధారంగా శుభా అశుభాలుగా నిర్ణయిస్తారు. కోయిల కూత ఉదయం పూట అగ్నేయ దిశగా వినిపిస్తే అశుభం జరుగుతుందని, అదే సాయంత్రం సమయంలో వినిపిస్తే అది శుభా సూచికగా పరిగణిస్తారు. ఇక మధ్యానం సమయంలో వినిపిస్తే అది శుభంగా భావిస్తారు.. మామిడి చెట్టుపై కోయిల కూస్తే మనకు తిరుగు ఉండదు.. అమ్మవారి అనుగ్రహం మనకు ఉన్నట్లే.. అదేవిదంగా చాలా మంది బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు. అయితే బల్లి వలన కొన్ని శుభ సూచికలు కూడా ఉంటాయి. అకస్మాతుగా బల్లి మీ కుడి భుజం మీద లేదా కుడి భాగంలో ఎక్కడ పడినా కూడా శుభ సూచికం..
జ్యోతిష్యం ప్రకారం.. నల్ల చీమలు శుభసూచికగా భావిస్తారు. నల్ల చీమలు నోటితో భియ్యంను ను మోసుకొని వెళ్తే అది శుభసూచికంగా భావించాలి. అక్షింతలు లక్ష్మీదేవికి అత్యంత ప్రితికరమైనవి. అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నవి. అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే ఆ సంకేతం అంతమంచిది కాదనే చెప్పవచు. ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే మీపై అప్పుల బారం పెరుగుతుందని అర్థం.. పాము ఇంట్లో కనిపిస్తే కూడా లక్ష్మి దేవి అనుగ్రహం కలిగిందని.. ఇలాంటివి కనిపిస్తే మీపై లక్ష్మి కటాక్షం కలిగినట్లే.. త్వరలోనే మీరు ధనవంతులు అవుతున్నారని అర్థం..