Site icon NTV Telugu

Koti Deepotsavam Day 13: నేటితో కోటి దీపోత్సవం ముగింపు.. చివరి రోజు విశేష కార్యక్రమాలు ఇవే..

Koti Deepotsavam 2025 12th Day

Koti Deepotsavam 2025 12th Day

Koti Deepotsavam Day 13: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ఆధ్యాత్మిక మహా సమ్మేళనం కొనసాగుతోంది.. భక్తి టీవీ నేతృత్వంలో జరుగుతోన్న కోటి దీపోత్సవంలో ఇప్పటికే విజయవంతమైంది. ప్రత్యేక పూజలతో పాటు విశేష కార్యక్రమాలు నిర్వహించారు.. ప్రతీ రోజూ విశేష పూజలు.. కల్యాణాలు.. ప్రవచనాలు, వాహన సేవలతో భక్తులను కట్టిపడేస్తోంది కోటి దీపోత్సవం వేడుక.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం.. సనాతన ధర్మ వ్యాప్తి కోసం.. లక్షల దీపాలతో లక్ష దీపోత్సవంగా ప్రారంభించిన ఈ దీపోత్సవం.. ఆ తర్వాత కోటి దీపాల యజ్ఞంగా రూపాంతరం చెందింది.. అది ఎంతలా అంటే.. కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ప్రతీ ఏటా భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా నిర్వహించే కోటి దీపోత్సవం గురించి భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూసేంత వరకు వెళ్లింది. అయితే.. ఈ నెల ఒకటిన ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక వేడుక నేటితో ముగియనుంది. చివరి రోజు విశేష కార్యక్రమాల గురించి తెలుసుకుందా..

READ MORE: Delhi Bomb Blast: ఢిల్లీ పేలుడు కేసులో సంచలనం.. DNA పరీక్ష ద్వారా కారులోని మృతదేహం గుర్తింపు..

పదమూడవ రోజు విశేష కార్యక్రమాలు 13-11-2025 (కార్తిక గురువారం)
ఇక, ఈ కోటి దీపాల పండుగలో భాగంగా పదమూడవ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామీజీ (శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు, శ్రీ శంకర భగవత్పాద పరంపరాగత మూలామ్నాయ సర్వజ్ఞ పీఠం) ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం ఉంటుంది. బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు ప్రవచనామృతం నిర్వహిస్తారు. వేదికపై కంచి కామాక్షి, మధురై మీనాక్షి, కాశీ విశాలాక్షి అమ్మవార్లకు కోటి గాజుల అర్చన ఉంటుంది. వేదికపై భక్తులచే కామాక్షి విగ్రహాలకు కోటి గాజుల అర్చన ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం.. కంచి శ్రీ ఏకాంబరేశ్వర స్వామి కల్యాణోత్సవం, మధురై మీనాక్షి కల్యాణోత్సవం కన్నుల పండువగా కొనసాగనుంది. నంది వాహన పల్లకీ సేవతో ముగుస్తుంది.

Exit mobile version