Site icon NTV Telugu

2025 Koti Deepotsavam: సరస్వతీదేవి మహాపూజ, పుస్తకపూజ.. ‘కోటి దీపోత్సవం’లో నేటి విశేష కార్యక్రమాలు ఇవే!

Koti Deepotsavam 2025 12th Day

Koti Deepotsavam 2025 12th Day

కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ 2025 దిగ్విజయంగా కొనసాగుతోంది. విశేష పూజలు, అనుగ్రహ భాషణం, ప్రవచనాలు, కళ్యాణం, వాహన సేవలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో గత రెండు వారాలుగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. కోటి దీపోత్సవం రేపటితో ముగియనుంది. దీపాల పండుగలో నేడు 12వ రోజు. నేటి విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం.

Also Read: Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. భక్తుల ఆగ్రహం!

పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి (శ్రీపీఠం, కాకినాడ), పూజ్యశ్రీ భాస్కరానందజీ మహారాజ్ (మహామండలేశ్వర్, బృందావనం) గారిచే అనుగ్రహ భాషణం ఉంటుంది. బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై బాసర సరస్వతీదేవి మహాపూజ, కోల్‌కతా కాళీ కుంకుమ పూజ ఉంటుంది. భక్తులచే సరస్వతి పుస్తక పూజ చేపించనున్నారు. వరంగల్ భద్రకాళీ కల్యాణోత్సవం, డోకిపర్రు శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం జరగనుంది. చివరగా సింహ వాహనం, పల్లకీ సేవ ఉంటుంది. ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం 5.30కు కోటి దీపోత్సవం కార్యక్రమాలు ఆరంభం అవుతాయి.

 

 

Exit mobile version