Khairatabad Ganesh: భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వీధి వీధినా మండపాలు నిర్మించి, వినాయక విగ్రహాలను ప్రతిష్టించడంతో నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణనాథుడి తొలి పూజలకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఖైరతాబాద్ బడా గణేష్‌కు మొదటి పూజ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతి 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం విశేషం. ఏళ్ల క్రితం కేవలం ఒక్క అడుగు ఎత్తుతో ప్రారంభమైన ఈ గణేశుడి విగ్రహ ఎత్తు క్రమంగా పెరుగుతూ 70 అడుగుల వరకు చేరింది. అయితే కరోనా మహమ్మారి తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉత్సవ సమితి భావితరాల భద్రతను దృష్టిలో ఉంచుకుని అడుగుల ఎత్తును కొద్దికొద్దిగా తగ్గిస్తూ వస్తోంది. ఎన్ని వినాయక విగ్రహాలు ప్రతిష్టించినా ఖైరతాబాద్ వినాయకుడి విశిష్టత, వైభవం ప్రత్యేకమైనవిగా నిలుస్తాయి. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ గత కొన్నేళ్లుగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పూర్తి మట్టితోనే ఈ భారీ విగ్రహాన్ని రూపొందిస్తుండటం గమనార్హం. ఈసారి ఖైరతాబాద్‌లో 69 అడుగుల భారీ ఎత్తులో “పంచముఖ సంకటహర మహాగణపతి”గా బడా గణేష్ కొలువుదీరాడు. స్వామివారికి ఒకవైపు ప్రసిద్ధ సోమనాథ్ జ్యోతిర్లింగం, మరోవైపు కాళీమాత విగ్రహాలను అత్యంత రమణీయంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ గణేశుడి పూర్తి చరిత్ర గురించి భక్తి టీవీలో ప్రసారమైన కింది వీడియో ద్వారా తెలుసుకుందాం..
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)

Khairatabad Ganesh1
