Site icon NTV Telugu

Friday: శుక్రవారం ఈ విధంగా పూజ చేస్తే.. మీ ఇంట్లో లక్ష్మీ దేవి నాట్యం చేస్తుంది..

Lakshmi Devi Oliwkvkiz5wf038t

Lakshmi Devi Oliwkvkiz5wf038t

శుక్రవారం అంటే లక్ష్మీ వార్ అంటారు.. ఈరోజు నియమాలతో పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.. శుక్రవారం శుక్రుడికి చెందినదిగా పరిగణించబడుతుంది. ప్రతి ఒకరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే శుక్రవారాల్లో కొన్ని పనులు చేయడం ద్వారా శుక్రుడు బలపడి లాభాలను పొందవచ్చు. మీరు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే, శుక్రవారం రోజున కొన్ని రకాల పనులు చేయాల్సిందే.. అవేంటో వివరంగా తెలుసుకుందాం..

ప్రతి శుక్రవారం నాడు ఇంటిని పరిశుభ్రతతో ఉంచుకోవాలి.. అలాగే అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజించాలి. ఈ రోజు ఉపవాసం ఉండటం చాలా మంచిది.. ఇక పూజ చేయడంతో పాటు ఆ రోజున ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో మంచి మంచి ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే శుక్రవారం రోజున శ్రీ సూక్తం పఠించడం మంచిది. క్రమం తప్పకుండా శ్రీ సూక్తం పారాయణం చేస్తే శుక్రుని స్థానం బలపడి స్వల్పకాలంలోనే లాభాలు కలుగుతాయి. అదేవిధంగా శుక్రవారం రోజు తప్పకుండా తెల్లని దుస్తులు ధరించాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని భక్తితో అమ్మ స్త్రోత్రాన్ని చదవాలి..

ప్రతి శుక్రవారం ఇలా చేస్తే డబ్బులకు డోకా ఉండదు.. ఇంట్లో సుఖసంతోషాలు, సంపదలు సులువుగా పెరుగుతాయి. అలాగే ఎవరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే, శుక్రవారాల్లో శుభ్రమైన నెయ్యిని ఆలయానికి దానం చేయాలి. అందువల్ల శుక్రుడు బలవంతుడై సంపద శ్రేయస్సుతో జీవించగలడు. అదేవిధంగా మీ పని, వ్యాపారం లేదా మరేదైనా పనిలో ఆటంకాలు ఉంటే, శుక్రవారం నల్ల చీమలకు పంచదార ఇవ్వాలి.. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అమ్మవారిని పూజించాలి.. అలాగే మీ బెడ్ రూమ్ లో రొమాంటిక్ పక్షుల చిత్ర పఠాలను ఉంచాలి అప్పుడే మీ మధ్య సఖ్యత పెరుగుతుంది.. బంధం బలపడుతుంది..

Exit mobile version