Site icon NTV Telugu

Year End Offers 2023: ఈ కార్ల పై భారీ ఆఫర్స్.. ఏకంగా రూ.4 లక్షలు ఆఫర్స్.. ఐదు రోజులు మాత్రమే..

Year End

Year End

ఈ ఏడాది మరి కొద్ది రోజుల్లో ముగింపుకు చేరుకొనుంది.. కొత్త సంవత్సరం రానుంది.. 2023 కనుమరుగు కాబోతోంది. ఈ క్రమంలో సాధారణంగా అన్ని ఉత్పత్తులపై అనేక రకాల ఆఫర్లు ఉంటాయి. ఎందుకంటే 2023లో తయారైన ప్రతి వస్తువు కొత్త సంవత్సరంలో పాత వస్తువు అవుతుంది.. ఈ ఏడాది చివరగా కొన్ని కార్ల పై భారీ తగ్గింపు ఉంది.. ఆ కార్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మహీంద్రా ఎక్స్‌యూవీ400 .. ఈ కారు గురించి అందరికి తెలుసు.. ఏకంగా రూ. 4.2 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే దీనిలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్ ఉండదు. ఒకవేళ ఎక్స్‌యూవీ400 ఈఎస్సీ ఫీచర్ కావాలనుకుంటే మాత్రం తగ్గింపు ధర కాస్త పెరుగుతుంది.. మొత్తం మీద ఈఎస్సీ వెర్షన్‌లు రూ. 3.2 లక్షల మేర తగ్గింపుతో వస్తాయి.. ఇక 1.7 లక్షల వరకు తగ్గింపు ఉంటుంది..

ఎంజీ జెడ్ఎస్ ఈవీ.. ఈ కార్ల పై అదిరిపోయే ఆఫర్ ఇప్పటికే అనువైన బడ్జెట్లో ఉండే ఈ కారుపై ఇప్పుడు రూ. 1లక్షకు పైగా తగ్గింపును అందిస్తున్నారు. ఎంజీ జెడ్ఎస్ ఈవీపై 50,000 వరకూ ఎక్స్ చేంజ్ బోనస్, లాయల్టీ, కార్పొరేట్ డీల్స్ తో రూ. 50,000 వరకూ తగ్గింపు లభిస్తోంది.. అంతేకాదు భారీ తగ్గింపు ఉండగా ప్రస్తుతం ఈ కారు ధర వచ్చేసి రూ. 23.38లక్షలుగా ఉంది..

హ్యుందాయ్ కోనా ఈవీ.. ఈ కార్ల పై రూ. 3 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది.. 39.2 కేడబ్ల్యూ బ్యాటరీతో పాటుప్రామాణిక ఏసీ చార్జర్, 50 కేడబ్ల్యూ డీసీ చార్జర్ను కలిగి ఉంటుంది.. ఆరు గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది..

ఎంజీ కామెట్.. ఈ ఏడాది మేలోనే దీనిని మార్కెట్లోకి లాంచ్ చేసింది. అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా రూపొందిన ఈ కారు మార్కెట్ ధర రూ. 7.98 లక్షలతో ప్రారంభమవుతుంది.. ఇప్పుడు దీనిపై రూ. 65,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. తద్వారా 2023 స్టాక్ క్లియరెన్స్ చేయాలని భావిస్తోంది. ఈ ఆఫర్లో ఎక్స్ చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ వంటి మిళితమై ఉంటాయి… ఇవే కాదు ఇంకా కొన్ని కార్ల పై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయని తెలుస్తుంది..

Exit mobile version