705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!

Xiaomi

Xiaomi

Xiaomi YU7 GT Electric: చైనా టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi) ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మరింత పెంచుకునేందుకు కొత్త షియోమీ YU7 Standard అండ్ షియోమీ YU7 GT మోడళ్లను అధికారికంగా ప్రకటించింది. లగ్జరీ, హై-పర్ఫార్మెన్స్, ఫ్యామిలీ SUV అనుభవాన్ని ఒకే వాహనంలో అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVలు ప్రస్తుతం మార్కెట్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

డిజైన్ పరంగా Xiaomi YU7 సిరీస్ స్పోర్టీ & ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటోంది. పొడవైన హుడ్, గ్రౌండ్‌కు దగ్గరగా ఉండే స్టాన్స్, క్రాస్-షేప్ హెడ్‌లైట్స్, హాలో టెయిల్‌లైట్స్ వంటి అంశాలు ఈ SUVలకు ప్రత్యేక గుర్తింపునిస్తున్నాయి. కంపెనీ కొత్తగా క్రిమ్సన్ రెడ్, రేడియంట్ పర్పల్, వోల్కనిక్ గ్రే కలర్ ఆప్షన్‌లను కూడా తీసుక వచ్చింది. Xiaomi YU7 సిరీస్ ఇప్పటికే మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. లాంచ్ అయిన మొదటి 18 గంటల్లోనే 2.4 లక్షలకు పైగా లాక్ చేసిన ఆర్డర్లు వచ్చాయి.

Xiaomi YU7 Standard ఫీచర్లు:
Xiaomi YU7 Standard మోడల్‌ను రోజువారీ వినియోగం, పనితీరు & సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. ఇందులో 73kWh LFP బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది 752V సిలికాన్ కార్బైడ్ హై-వోల్టేజ్ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో 643 కిలోమీటర్ల వరకు CLTC రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. కేవలం 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 385 కి.మీ. వరకు రేంజ్ పొందవచ్చు.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ SUV 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 5.9 సెకన్లలో చేరుకుంటుంది. గరిష్ట వేగం 220 kmphగా ఉంది. ఈ వాహనంలో షియోమీ స్మార్ట్ చాసిస్ 2.0 సిస్టమ్‌ను అందించారు. ఫ్రంట్ డబుల్ విశ్‌బోన్, రియర్ ఫైవ్-లింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్, డ్యూయల్ చాంబర్ ఎయిర్ స్ప్రింగ్స్, వేరియబుల్ డ్యాంపింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా స్పోర్ట్+, కంఫర్ట్ వంటి మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు కూడా ఇందులో ఉన్నాయి.

Xiaomi YU7 GT:
Xiaomi YU7 GT కంపెనీ ఫ్లాగ్‌షిప్ హై-పర్ఫార్మెన్స్ SUVగా మార్కెట్లోకి వచ్చింది. ట్రాక్ డ్రైవింగ్ & అత్యుత్తమ వేగం కోరుకునే వినియోగదారుల కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ SUVలో 101.7kWh టర్నరీ లిథియం బ్యాటరీను అందించారు. 897V అల్ట్రా హై వోల్టేజ్ ప్లాట్‌ఫారమ్, 5.2C ఛార్జింగ్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించారు. పూర్తి ఛార్జ్‌తో 705 కిలోమీటర్ల వరకు CLTC రేంజ్ ఇస్తుంది.

అత్యంత శక్తివంతమైన Xiaomi HyperEngine V8s EVO మోటార్ అండ్ డ్యూయల్ మోటార్ సెటప్ సహాయంతో ఈ SUV మొత్తం 1003PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 2.92 సెకన్లలో చేరుకోగలదు. దీని గరిష్ట వేగం 300 kmph. ఈ GT మోడల్‌లో కార్బన్ సిరామిక్ బ్రేకింగ్ సిస్టమ్, Akebono 6-పిస్టన్ ఫ్రంట్ కాలిపర్స్, ఎలక్ట్రానిక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ (eLSD), డ్యూయల్ వాల్వ్ CDC డ్యాంపర్స్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి.

అలాగే ఇందులో ప్రీమియం ఇంటీరియర్‌ను అందించారు. 2.3 చదరపు మీటర్ల Alcantara సాఫ్ట్ టచ్ ర్యాపింగ్, కార్బన్ ఫైబర్ ట్రిమ్స్, GT థీమ్ UIతో కూడిన ఫైవ్-స్క్రీన్ కాక్‌పిట్ సిస్టమ్, 40W GT స్పోర్ట్ సౌండ్ స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా 18-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, మసాజ్, హీటింగ్, వెంటిలేషన్ సపోర్ట్, 132 డిగ్రీల వరకు రిక్లైన్ అయ్యే రియర్ సీట్లు, డ్యూయల్ జీరో గ్రావిటీ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు లభిస్తున్నాయి.

చైనాలో Xiaomi YU7 Standard ధర RMB 233,500గా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 32.9 లక్షలు. ఇక Xiaomi YU7 GT ధర RMB 389,900 కాగా, భారత కరెన్సీలో దాదాపు రూ. 54.9 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ SUVలు చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.