TVS Ronin Price Hike: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor Company తన ప్రీమియం మోటార్‌సైకిల్ TVS Ronin ధరలను భారత మార్కెట్‌లో పెంచింది. కంపెనీ మొత్తం ఆరు వేరియంట్ల ధరలను రూ.1,000 నుంచి రూ.1,800 వరకు పెంచింది. తాజా ధరల సవరణ తర్వాత TVS Ronin ప్రారంభ ధర రూ.1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అయితే ధర పెంచినప్పటికీ బైక్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఇంజిన్, ఫీచర్లు, డిజైన్ వంటి అంశాలు గతంలో మాదిరిగానే కొనసాగుతున్నాయి.
TVS Ronin కొత్త ధరలు ఇవే
TVS Roninలో Agonda Edition ధర అత్యధికంగా పెరిగింది. ఈ వేరియంట్‌పై రూ.1,800 పెంపు విధించడంతో ధర రూ.1,33,790కు చేరింది.
బేస్ Lightning Black వేరియంట్ ధర రూ.1,600 పెరిగి రూ.1,30,290గా ఉంది. ఇక Magma Red వేరియంట్ ధర రూ.1,500 పెరిగి రూ.1,31,990కు చేరింది.
మీడియం రేంజ్ లోని Glacier Silver వేరియంట్ ధర రూ.1,000 పెరిగి రూ.1,50,040 కాగా, Charcoal Ember వేరియంట్ ధర రూ.1,51,340గా ఉంది.
టాప్-స్పెక్ వేరియంట్ ధర కూడా రూ.1,000 పెరిగి రూ.1,62,640కు చేరింది.
TVS Ronin కొత్త ధరల జాబితా
వేరియంట్ కొత్త ధర పాత ధర పెంపు
Agonda Edition ₹1,33,790 ₹1,31,990 ₹1,800
Base Lightning Black ₹1,30,290 ₹1,28,690 ₹1,600
Base – Magma Red ₹1,31,990 ₹1,30,490 ₹1,500
Mid – Glacier Silver ₹1,50,040 ₹1,49,040 ₹1,000
Mid – Charcoal Ember ₹1,51,340 ₹1,50,340 ₹1,000
Top-మిడ్ నైట్ బ్లూ ₹1,62,640 ₹1,61,640 ₹1,000
ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు లేవు
ధర పెరిగినప్పటికీ TVS Roninలో ఎలాంటి మెకానికల్ అప్‌డేట్ చేయలేదు. ఈ బైక్‌లో అదే 225cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్ కొనసాగుతోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 20.43 PS పవర్, 19.93 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ ప్రయాణాలకు అనువుగా స్మూత్ పవర్ డెలివరీ అందించడం TVS Ronin ప్రత్యేకతల్లో ఒకటి.
ఫీచర్లు కూడా యథాతథమే
ధర పెంపు తర్వాత కూడా బైక్ ఫీచర్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే దాని డిజైన్, రైడింగ్ సెటప్ కూడా మునుపటిలాగే కొనసాగుతున్నాయి. కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్, స్మూత్ పవర్ డెలివరీ కారణంగా నగర ప్రయాణాలతో పాటు రోజువారీ కమ్యూటింగ్‌కు TVS Ronin అనుకూలంగా ఉంటుంది.
కొనుగోలుదారులపై ధర పెంపు ప్రభావం
TVS Ronin ఇప్పటికే ప్రీమియం 225cc మోటార్‌సైకిల్ విభాగంలో పోటీ పడుతోంది. తాజా ధర పెంపుతో ఎంట్రీ వేరియంట్ కూడా రూ.1.30 లక్షల మార్క్ దాటింది. అయితే బైక్‌లో కొత్త ఫీచర్లు లేదా పనితీరు మార్పులు లేకపోవడంతో, కొత్త ధరకు కొనుగోలు చేసేవారు ధర-ఫీచర్ల విలువను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

