TVS Callisto 110 Launched: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్స్ గ్లోబల్ ఉత్పత్తుల శ్రేణిని మరింత విస్తరించింది. ఇందులో భాగంగా 2026 నవంబర్ 11న టర్కీలోని ఇస్తాంబుల్‌లో కొత్త TVS Callisto 110 స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ధరను 1,32,600 టర్కిష్ లిరాలుగా నిర్ణయించింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.2,47,489గా ఉంది. ప్రధానంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ స్కూటర్‌ను రూపొందించారు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు ఆధునిక టెక్నాలజీ, అధిక స్టోరేజ్ సామర్థ్యం, భద్రతా ఫీచర్లను ఇందులో అందించారు. మరి ఈ కొత్త స్కూటర్‌లో ఉన్న ఫీచర్లు, ఇంజిన్ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
TVS Callisto 110 ఇంజిన్, మైలేజ్
TVS Callisto 110 స్కూటర్‌లో 113.3cc ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌ను అమర్చారు. దీనిని CVTi ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. దీంతో గేర్ మార్చే అవసరం లేకుండా సులభంగా ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్‌లో కొత్త తరం Stop-Go టెక్నాలజీని అందించారు. ఈ టెక్నాలజీ ద్వారా ఇంధన సామర్థ్యం 10 శాతం వరకు మెరుగుపడుతుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా సెగ్మెంట్‌లోనే అత్యంత పొడవైన సీటు, ఎక్కువ లెగ్‌రూమ్, వెనుకవైపు అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్లను అందించారు. ఇవి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందించనున్నాయి.
ఈ స్కూటర్‌లో ప్రధాన ఆకర్షణ 33 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్. ఇందులో రెండు హాఫ్ ఫేస్ హెల్మెట్లను సులభంగా భద్రపరుచుకోవచ్చు. అలాగే 12 ఇంచుల అల్లాయ్ వీల్స్‌ను అందించారు. స్కూటర్‌ను స్టార్ట్ చేసేందుకు సైలెంట్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్‌ను అమర్చారు. బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ కారణంగా స్కూటర్‌ను నియంత్రించడం, బ్యాలెన్స్ చేసుకోవడం మరింత సులభంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
టెక్నాలజీ పరంగా కూడా TVS Callisto 110లో పలు ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పూర్తిస్థాయి డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉంటుంది. దీంతో పాటు నావిగేషన్, వాయిస్ అసిస్టెన్స్, కాల్ నోటిఫికేషన్లు, మెసేజ్ అలర్ట్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రయాణ సమయంలో అవసరమైన సమాచారాన్ని డిజిటల్ డిస్‌ప్లే ద్వారా తెలుసుకోవచ్చు.
భద్రత కోసం ప్రత్యేక ఫీచర్లు
రైడర్ భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్కూటర్‌లో మెటల్ బాడీని అందించారు. ఇంకా పలు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఫాలో మీ హెడ్‌ల్యాంప్
హజార్డ్ ల్యాంప్స్
ఆటోమేటిక్ టర్న్ సిగ్నల్ రీసెట్
ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్
సైలెంట్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్
ఆల్ ఇన్ వన్ లాక్ సిస్టమ్
ముందు భాగంలో ఫ్యూయల్ ఫిల్లింగ్ సౌకర్యం
ముఖ్యంగా ముందు భాగంలోనే పెట్రోల్ నింపుకునే సౌకర్యం ఉండటం వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది.
మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు
TVS Callisto 110 స్కూటర్‌ను మూడు రంగుల్లో అందిస్తున్నారు. అవి:
బ్లూ (Blue)
వైట్ (White)
రెడ్ (Red)

