Skoda Slavia Facelift: స్కోడా ఆటో ఇండియా ఇటీవల భారత మార్కెట్లో కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. ఇప్పుడు అదే దిశగా తన ప్రీమియం సెడాన్ అయిన స్లావియాను కూడా అప్‌డేట్ చేయడానికి రెడీ అవుతోంది. 2026 నాటికి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు సంస్థ అధికారులు ధృవీకరించారు. అధికారిక ఆవిష్కరణకు ముందే ఈ కారు పలు మార్లు టెస్టింగ్ సమయంలో కెమెరాకు చిక్కింది. దాంతో కార్లో రాబోయే మార్పులపై కొంత క్లారిటీ వచ్చింది.
Read Also: AP Handicrafts Global Recognition: ఏపీ హస్తకళలకు అంతర్జాతీయ వేదికపై మరో గుర్తింపు
కాగా, ప్రస్తుతం స్కోడా లైనప్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న మోడళ్లలో స్లావియా ఒకటి. ఇది వోక్స్‌వ్యాగన్ విర్టస్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ లాంటి కార్లతో పోటీ పడుతోంది. ఈ మోడళ్లన్నీ కూడా రాబోయే కాలంలో అప్‌డేట్స్ పొందే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా హోండా సిటీకి 2027లో కొత్త జనరేషన్ వెర్షన్ రానుందని అంచనా. ఇప్పటి వరకు వచ్చిన స్పై షాట్స్ ఆధారంగా చూస్తే.. స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో ముందు భాగంలో స్పష్టమైన డిజైన్ మార్పులు ఉండనున్నాయి. కొత్తగా నిలువు గీతలతో కూడిన గ్రిల్, అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్ యూనిట్లు, కొత్త ఫాగ్ ల్యాంప్స్ అందించే అవకాశం ఉంది. అలాగే, బంపర్ డిజైన్‌లో కూడా మార్పులు, వెబ్ డిజైన్‌తో కూడిన కొత్త ఎయిర్ డ్యామ్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వెనుక భాగంలో టెయిల్ లైట్ల డిజైన్‌తో పాటు రియర్ బంపర్ కూడా కొత్తగా రూపుదిద్దుకోనుంది.
Read Also: Bhatti Vikramarka: తెలంగాణ కు ఆత్మ సింగరేణి.. గత డాక్యుమెంట్ల ఆధారంగానే సింగరేణి టెండర్లు
అయితే, క్యాబిన్ లోపల కూడా కీలకమైన అప్‌డేట్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి స్కోడా కుషాక్‌లో అందించిన ఫీచర్లకు అనుగుణంగా ఉండే ఛాన్స్ ఉంది. కొత్త అప్హోల్స్టరీ, మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అలాగే, పానోరామిక్ సన్‌రూఫ్‌ను కూడా చేర్చవచ్చని అంచనా. టాప్ వేరియంట్లలో అయితే సెగ్మెంట్‌లోనే ప్రత్యేకమైన ఫీచర్‌గా రియర్ సీట్లకు మసాజ్ ఫంక్షన్‌ను కూడా అందించే అవకాశం ఉందని తెలుస్తుంది.
Read Also: MK Stalin: ఆ పదవిని అవమానించారు.. గవర్నర్ రవిపై స్టాలిన్ ధ్వజం
కాగా, ఇది కేవలం ఫేస్‌లిఫ్ట్ మోడల్ కావడంతో.. ఇంజిన్ విభాగంలో పెద్ద మార్పులు ఉండే అవకాశం తక్కువగా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.0 లీటర్, 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (115 హెచ్‌పీ) 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కొనసాగనుంది. అలాగే, 1.5 లీటర్, 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (150 హెచ్‌పీ) 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోనే ఉండనుంది. అయితే, కుషాక్‌లో మాదిరిగానే, స్లావియాలో కూడా 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జోడించే ఛాన్స్ ఉందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా, 2026లో రానున్న స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ మరింత ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లతో పాటు ప్రీమియం అనుభూతితో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో పోటీని మరింత ఆసక్తికరంగా మార్చనుంది.
