Site icon NTV Telugu

Nissan Gravite: స్పోర్టీ లుక్.. ఆకట్టుకునే డిజైన్! 7-సీటర్ నిస్సాన్ ‘గ్రావైట్’ వచ్చేస్తోంది!

Nissan

Nissan

Nissan Gravite Compact MPV India Launch in 2026: నిస్సాన్ ఇండియా తన తాజా కాంపాక్ట్ ఎంపీవీని ‘గ్రావైట్’ అనే పేరుతో పరిచయం చేసింది. ఈ కారు భారత మార్కెట్లో 2026 ప్రారంభంలో లాంచ్ కానుంది. కంపెనీ ప్రకటన ప్రకారం.. 2026 మార్చి నుంచి షోరూమ్‌లలో అందుబాటులోకి వస్తుంది. ఇదే సమయంలో నిస్సాన్ కొత్త ప్రోడక్ట్ లైనప్‌లో భాగంగా ‘టెక్టాన్’ SUVను కూడా ఇటీవల పరిచయం చేసింది. అంతేకాదు, 2027లో మరో 7-సీటర్ SUVను కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. కొత్త ఏడాదిలో గ్రావైట్ లాంచ్‌తో నిస్సాన్ తన ప్రోడక్ట్ విస్తరణను ప్రారంభించనుంది. ఆ తర్వాత కొద్ది నెలల గ్యాప్‌తో టెక్టాన్, ఆపై 2027లో 7-సీటర్ SUV మార్కెట్లోకి రానున్నాయి. ఇప్పటివరకు నిస్సాన్ భారతదేశంలో మాగ్నైట్‌తో సెగ్మెంట్‌లో మాత్రమే ఉంది.

READ MORE: West Bengal: హిందీ మాట్లాడే ఓటర్లే లక్ష్యం?.. ముస్లిం ప్రాంతాల్లో తక్కువ.. బెంగాల్ SIR డ్రాఫ్ట్‌పై రాజకీయ దుమారం

కాగా.. కంపెనీ గ్రావైట్ డిజైన్‌ను పూర్తిగా బయటపెట్టకపోయినా, కొంత వరకు లుక్‌ను చూపించింది. ఇది నిస్సాన్ కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ను పోలి ఉంటుంది. ముందు భాగంలో కొత్త గ్రిల్‌, మధ్యలో నిస్సాన్ లోగో, క్రోమ్ వినియోగం కనిపిస్తాయి. ఇరువైపులా కొత్త డిజైన్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. బోనెట్‌పై హుడ్ స్కూప్‌లా కనిపించే డిజైన్ ఉండటంతో కారు మస్క్యులర్ లుక్ ఇస్తుంది. ఎంపీవీ సిల్హౌట్ ట్రైబర్‌ను గుర్తుకు తెచ్చినా, ఇందులో కొత్త ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. ఉదాహరణకు కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ వచ్చే అవకాశం ఉంది. టీజర్ ఇమేజెస్‌లో ఫంక్షనల్ రూఫ్ రైల్స్ కూడా కనిపిస్తున్నాయి. వెనుక భాగంలో కొత్త టెయిల్ ల్యాంప్ డిజైన్‌తో పాటు క్రోమ్ టచ్ కూడా ఉంటుంది.

READ MORE: Palnadu: ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి ఘటన.. ఏఎస్సై కుమారుడిపై మరో కేసు నమోదు

ఇంటీరియర్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే డ్యాష్‌బోర్డ్‌లో వివిధ మెటీరియల్స్ ఉపయోగించి పూర్తిగా కొత్త ఇంటీరియర్ డిజైన్ ఉండే అవకాశం ఉంది. కొన్ని ఫీచర్లు ట్రైబర్‌తో పోలి ఉండొచ్చు. ఈ ఎంపీవీ మూడు వరుసల సీటింగ్‌తో వస్తుందని అంచనా. అవసరానికి అనుగుణంగా 5, 6 లేదా 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లో ఉపయోగించుకోవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే, 7-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో), వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, సెంటర్‌లో కూల్డ్ స్టోరేజ్, సెకండ్ రో సీట్లు స్లైడ్, రిక్లైన్ అయ్యే సదుపాయం ఉండే అవకాశం ఉంది. నిస్సాన్ గ్రావైట్‌లో 1.0 లీటర్, 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది 72 హెచ్‌పీ పవర్, 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్‌గా 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ఆప్షన్ ఉంటుంది. ఇది ట్రైబర్‌లో ఉన్న ఇంజిన్ సెటప్‌లానే అయినా, డ్రైవింగ్ అనుభూతి మెరుగ్గా ఉండేలా నిస్సాన్ ఇంజిన్ మరియు గేర్‌బాక్స్‌ను కొంత ట్యూన్ చేసే అవకాశం ఉంది.

Exit mobile version