భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!

  • భారత మార్కెట్లో లాంచ్ అయిన Mini Cooper S GP Inspired Edition
  • ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన Mini GP నుంచి స్ఫూర్తి పొందిన ప్రత్యేక ఎడిషన్
  • దేశవ్యాప్తంగా కేవలం 30 యూనిట్లకే పరిమితమైన లిమిటెడ్ ఎడిషన్ మోడల్
  • రూ.58.90 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చిన హాట్ హ్యాచ్..
Mini Cooper S Gp Inspired Edition

Mini Cooper S Gp Inspired Edition

Mini Cooper S GP Inspired Edition Launched: “మినీ ఇండియా” కంపనీ భారత మార్కెట్లో కొత్త మినీ కూపర్ ఎస్ జీపీ ఇన్స్పైర్డ్ ఎడిషన్ (Mini Cooper S GP Inspired Edition‌)ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐకానిక్ Mini GP నుంచి స్ఫూర్తి పొందిన ఈ ప్రత్యేక ఎడిషన్ కారును భారతీయ కొనుగోలుదారుల కోసం కేవలం 30 యూనిట్లకే పరిమితం చేశారు. కారుకు సంబంధించి ఈ నెల ప్రారంభంలోనే ఈ మోడల్‌కు ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

స్పోర్టీ డిజైన్:
ఈ మినీ కూపర్ ఎస్ జీపీ ఇన్స్పైర్డ్ ఎడిషన్ సాధారణ ‘Cooper S ‘ కంటే మరింత స్పోర్టీ, అగ్రెసివ్ లుక్‌తో వస్తోంది. ప్రత్యేకమైన లెజెండ్ గ్రే కలర్‌తో పాటు చిల్లి రెడ్ షేడ్‌లో రూఫ్, ORVM క్యాప్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. GP-ఇన్స్పైర్డ్ బోనెట్ స్ట్రైప్స్, సైడ్ గ్రాఫిక్స్ ఈ కారుకు ప్రత్యేక లుక్ న అందిస్తున్నాయి. ముందు భాగంలో జాన్ కూపర్ వర్క్స్ (JCW) స్టైల్ బంపర్, గ్రిల్‌తో పాటు రెడ్ వింగ్‌లెట్స్, రెడ్ టో స్ట్రాప్ ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్‌లో ‘GP Inspired’ బ్రాండింగ్‌తో పాటు ‘1 of 30’ బ్యాడ్జ్ ప్రత్యేకతను హైలైట్ చేస్తోంది. అంతేకాకుండా స్పోర్టీ సైడ్ స్కర్ట్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, రియర్ వింగ్‌లెట్స్, రియర్ డిఫ్యూజర్ వంటి ట్రాక్-ఫోకస్‌డ్ ఎలిమెంట్స్‌ను కూడా ఇందులో పొందు పరిచారు. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో 17 & 18 అంగుళాల JCW-spec అలాయ్ వీల్స్ ఉన్నాయి. చిల్లి రెడ్ సెంటర్ క్యాప్స్‌తో వీటి డిజైన్ మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. అలాగే మూడు రకాల DRL సిగ్నేచర్ మోడ్‌లు, ప్రత్యేక వెల్కమ్ మరియు గుడ్‌బై లైటింగ్ యానిమేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ప్రీమియం ఫీచర్స్:
ఇంటీరియర్‌లో కూడా స్పోర్టీ థీమ్ కొనసాగించారు. బ్లాక్ కలర్ క్యాబిన్‌తో పాటు రెడ్ హైలైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. JCW స్పోర్ట్స్ సీట్లు వీస్కిన్ బ్లాక్ అప్హోల్స్టరీతో, రెడ్ స్టిచింగ్‌తో వచ్చాయి. డాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్స్‌పై నిట్టెడ్ ఫాబ్రిక్ ఇన్‌సర్ట్స్ ఇచ్చారు. అలాగే డోర్ సిల్స్, ఫ్లోర్ మ్యాట్స్‌పై ‘GP Inspired’ మరియు ‘1 of 30’ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఫీచర్ల పరంగా ఈ కారులో ప్రీమియం ఎక్విప్‌మెంట్‌ కలిగి ఉంది. 9.4 అంగుళాల సర్క్యులర్ OLED టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జింగ్, పానోరమిక్ గ్లాస్ రూఫ్, హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, మెమరీ ఫంక్షన్‌తో పవర్డ్ డ్రైవర్ సీట్, అంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత కోసం లెవెల్ 1 ADAS, రియర్ వ్యూ కెమెరా, స్టెబిలిటీ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లను కూడా అందించారు.

పవర్‌ఫుల్ ఇంజిన్:
Mini Cooper S GP Inspired Editionలో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 204 hp పవర్, 300 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేసిన ఈ కారు ముందు చక్రాలకు పవర్‌ను అందిస్తుంది. కంపెనీ ప్రకారం ఈ హాట్ హ్యాచ్ కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 242 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ హాట్ హ్యాచ్ ధర రూ.58.90 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు.