ఎలక్ట్రిక్ వాహనాలు ఎకో ఫ్రెండ్లీగానే కాదు.. బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలు చౌక ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను తీసుకొస్తున్నాయి. లేటెస్ట్ ఫీచర్లతో అదిరిపోయే రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూర్లు, బైకులు మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్కూర్ లవర్స్ కు అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ సైకిల్ ధరలో లభించనున్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ మంత్ర కేవలం రూ. 35 వేల ధరలో న్యూ స్కూటర్లను తీసుకొచ్చింది.
అయితే నాన్ ఆర్టీవో కేటగిరీలోని బేస్ మోడల్ ధర రూ.35 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇది సింగిల్ ఛార్జ్ తో 60 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. కాగా మంత్ర తీసుకొచ్చిన స్కూటర్లలో ఆర్టీవో, నాన్ ఆర్టీవో కేటగిరీల్లో ఉన్నాయి. ఈవీ లవర్స్ కు మంత్ర బిగ్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 5000 డౌన్ పేమెంట్ తో కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పిస్తోంది. నాన్-ఆర్టీఓలో, సింగిల్ మోడల్ ధర రూ.35,000. ఒకసారి ఛార్జ్ చేస్తే 60 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. డ్యూయల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.40,000. వేపర్ గ్రిల్ మోడల్ ధర రూ.56,000. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
కాగా, వేపర్ యు మోడల్ ధర రూ. 54,000, మోనార్క్ మోడల్ ధర రూ. 57,000. ఇవి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ. వరకు ప్రయాణించొచ్చు. యాక్టివా మోడల్ రూ. 53,000 (80 కి.మీ), బి9 యాక్టివా న్యూ రూ. 60,000. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ.లు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్లలో జెల్ అండ్ లిథియం బ్యాటరీ ఆప్షన్స్, ఆటో- లాకింగ్ సిస్టం, రివర్స్ మోడల్, LED లైట్స్, పవర్ బ్రేక్స్, ట్యూబ్‌లెస్ టైర్స్, USB పోర్ట్, సెంట్రల్ లాకింగ్ సిస్టం వంటి ఫీచర్లు ఉంటాయి.