మహీంద్రా వాహనాల అమ్మకాలు గత 3 నెలలతో పోల్చితే నవంబర్‌లో అత్యల్పంగా ఉన్నాయి. కంపెనీ సెప్టెంబర్‌లో 51,062 యూనిట్లు, అక్టోబర్‌లో 54,504 యూనిట్లను విక్రయించింది. కాగా, నవంబర్‌లో ఈ సంఖ్య 46,222 యూనిట్లకు తగ్గింది. కంపెనీకి సంబంధించి మహింద్రా థార్ మినహా అన్ని మోడళ్ల అమ్మకాలు తగ్గాయి. ప్రతిసారీ మాదిరిగానే కంపెనీకి తక్కువ డిమాండ్ ఉన్న కారు మరాజో.. నవంబర్‌లో కేవలం 9 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అక్టోబర్‌లో 37 యూనిట్లు విక్రయించారు.
నెలల వారీగా సేల్స్..
మహీంద్రా మరాజో జూన్‌లో 12 యూనిట్లు, జూలైలో 14 యూనిట్లు, ఆగస్టులో 8 యూనిట్లు, సెప్టెంబర్‌లో 7 యూనిట్లు, అక్టోబర్‌లో 37 యూనిట్లు, నవంబర్‌లో 9 యూనిట్లు అమ్ముడైంది. కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి మరాజో యొక్క కొత్త మోడల్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఇది అమ్మకాలను పెంచడంలో విఫలమైంది. ఈ కొత్త మోడల్ అక్టోబర్‌లో 37 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
మహీంద్రా మరాజో వేరియంట్ వారీగా ధరలు..
మహీంద్రా మరాజో M2 7s వేరియంట్ పాత ధర రూ. 14,39,400గా ఉండగా..రూ.20,000 పెరిగి.. 14,59,400కి చేరింది. M2 8s వేరియంట్ పాత ధర రూ. 14,39,400 కాగా.. అది ఇప్పుడు రూ. 14,59,400కి పెరిగింది. అంటే దీని ధర రూ.20,000 ఎక్కువ. దాని M4 ప్లస్ 7s వేరియంట్ ధర రూ. 15,66,001 నుంచి రూ. 15,86,000కి చేరింది. దాని M4 ప్లస్ 8s వేరియంట్ యొక్క పాత ధర రూ. 15,74,200 ఉండగా.. రూ.20,000 పెంచేశారు. M6 ప్లస్ 7s వేరియంట్ రూ. 16,92,000, M6 ప్లస్ 8s వేరియంట్ రూ. 17,00,200గా కంపెనీ నిర్ణయించింది.
మరాజో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
ఈ మహీంద్రా MPVలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 121 హార్స్‌పవర్, 300 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ కారు యొక్క అన్ని వేరియంట్లలో ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, వెనుక పార్కింగ్ సెన్సార్ వంటి భద్రతా ఫీచర్లు అమర్చారు. దీంతో పాటు ఇందులో 7.0 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ), రిమోట్ కీ-లెస్ ఎంట్రీ, ఆటో క్లైమేట్ కంట్రోల్,17 అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.