Jeep Wrangler Whitecap Mojito Limited Edition: ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ జీప్ (Jeep) భారత మార్కెట్లో తన పాపులర్ ఆఫ్‌రోడ్ ఎస్యూవీ రాంగ్లర్‌లో ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. జీప్ రాంగ్లర్ వైట్‌క్యాప్ మోజిటో లిమిటెడ్ ఎడిషన్ (Jeep Wrangler Whitecap Mojito Limited Edition)పేరుతో తీసుకొచ్చిన ఈ మోడల్ ధరను రూ.73.55 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ కార్లు భారత్‌కు కేవలం 25 యూనిట్లను మాత్రమే కేటాయించగా, ఇప్పటికే అన్నీ అమ్ముడయ్యాయి. జీప్ ప్రపంచవ్యాప్తంగా వైట్‌క్యాప్ ఎడిషన్‌ను కేవలం 250 యూనిట్లకు పరిమితం చేసింది. అందులో భారత మార్కెట్‌కు 25 యూనిట్లు మాత్రమే కేటాయించింది. ఈ కార్ల డెలివరీలను 2026 అక్టోబర్ చివరి నాటికి జీప్ డీలర్‌షిప్‌ల ద్వారా పూర్తి చేయనున్నారు.
ఈ కారు ప్రధాన ఆకర్షణ దాని ప్రత్యేక డిజైన్. ఈ ఎస్యూవీ బ్రైట్ గ్రీన్ ‘మోజిటో’ కలర్‌తో వస్తుంది. దీనికి కాంట్రాస్ట్‌గా వైట్ రూఫ్‌ను అందించారు. గ్రిల్ చుట్టూ కూడా వైట్ ఫినిషింగ్ ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్‌పై ‘1941’ డెకల్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఒరిజినల్ Willys MB జీప్ తొలిసారి వచ్చిన సంవత్సరానికి గుర్తుగా వీటిని అందించారు. బూట్ లిడ్‌పై వైట్ కలర్లో ‘4 వీల్ డ్రైవ్’ స్టిక్కర్ ఉంటుంది. ఫెండర్లను బాడీ కలర్లోనే అందించారు. ఇంటీరియర్ విషయానికి వస్తే.. సాధారణ Wrangler Rubiconతో పోలిస్తే ఈ స్పెషల్ ఎడిషన్‌లో ప్రధానంగా రెండు అదనపు ఫీచర్లు ఉన్నాయి. బిల్ట్-ఇన్ డ్యాష్‌క్యామ్‌తో పాటు మరింత దృఢమైన గ్రాబ్ హ్యాండిల్స్‌ను అందించారు. మిగతా ఫీచర్లు రూబికాన్ లో ఉన్నట్లుగానే ఉంటాయి. ఇందులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, 12 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, సబ్‌వూఫర్‌తో కూడిన 9-స్పీకర్ Alpine ఆడియో సిస్టమ్, 7 అంగుళాల డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ADAS సూట్‌ను అందించారు.
మెకానికల్‌గా వైట్ క్యాప్ మొజిటో ఎడిషన్ లో ఎలాంటి ప్రధాన మార్పులు చేయలేదు. రూబికాన్‌లో ఉన్న 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్నే ఇందులో ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 272 Hp పవర్, 400 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ జత చేశారు. స్టాండర్డ్‌గా 4×4 సిస్టమ్ లభిస్తుంది. దీంతో కఠినమైన ఆఫ్‌రోడ్ మార్గాల్లోనూ మెరుగైన సామర్థ్యాన్ని అందించేలా రూపొందించారు. రూబికాన్ ఆధారంగా రూపొందించిన మోడల్ కావడంతో వైట్ క్యాప్ మొజిటో ఎడిషన్‌లో ఆఫ్‌రోడింగ్‌కు అవసరమైన ప్రత్యేక హార్డ్‌వేర్ కూడా కొనసాగుతోంది. హెవీ డ్యూటీ దాన యాక్సిల్స్, ఇంటిగ్రేటెడ్ ఆఫ్‌రోడ్ కెమెరా, రీన్ఫోర్స్డ్ సస్పెన్షన్, రాక్ రైల్స్ ఇందులో ఉన్నాయి. అలాగే 17 అంగుళాల వీల్స్‌పై 255-సెక్షన్ ఆఫ్‌రోడ్ టైర్లు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌కు అనుకూలమైన ఫ్రంట్ ఫెండర్ ఫ్లేర్స్‌ను అందించారు.
ONLY A FEW MOJITOS LEFT TO SAVOUR.
The Jeep® Wrangler Whitecap Mojito is already out making a statement in its signature green. And while good things are worth savouring, this one’s becoming harder to get your hands on.Have you got yours yet?
#jeepindia #whitecapmojito https://t.co/ICUb8mMS9c— Jeep India (@JeepIndia) October 1, 2026

