Jeep Meridian: భారత్‌లో జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ విడుదల.. కొత్త ఫీచర్లు, AI అసిస్టెంట్‌.. ధర ఎంతంటే?

  • భారతదేశం లో జీప్ కొత్త స్పెషల్ ఎడిషన్ విడుదల
  • కొత్త ఫీచర్లు, AI అసిస్టెంట్‌
  • ఎక్స్-షోరూమ్ ధర రూ.36.05 లక్షలు
Jeep India

Jeep India

జీప్ బ్రాండ్ 85వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, జీప్ ఇండియా ప్రీమియం SUV ‘జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్’ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ప్రత్యేక డిజైన్, AI ఆధారిత వాయిస్ అసిస్టెంట్, ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఈ లిమిటెడ్ ఎడిషన్ SUV కేవలం 85 యూనిట్లలో మాత్రమే అందుబాటులోకి రానుంది. ఈ ప్రత్యేక ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.36.05 లక్షలుగా నిర్ణయించారు. జీప్ డీలర్‌షిప్‌లతో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ప్రత్యేక డిజైన్‌తో ఆకర్షణ

జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్‌లో సాధారణ మోడల్‌తో పోలిస్తే కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు.
ముందు డోర్లపై, టెయిల్‌గేట్‌పై “85th Anniversary Edition” ప్రత్యేక డీకాల్స్
వీల్ సెంటర్ క్యాప్స్‌పై ప్రత్యేక 85వ వార్షికోత్సవ లోగో
లిమిటెడ్ ఎడిషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఇచ్చే డిజైన్ ఎలిమెంట్స్

ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో

ఈ స్పెషల్ ఎడిషన్ SUV ఐదు ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. పెర్ల్ వైట్, టెక్నో మెటాలిక్ గ్రీన్, వెల్వెట్ రెడ్, గ్రిజియో మాగ్నీషియో, బ్రిలియంట్ బ్లాక్. ఈ ఎడిషన్‌లో జీప్ CARA AI Voice Assistantను అందించింది. స్టెల్లాంటిస్ అభివృద్ధి చేసిన ఈ AI అసిస్టెంట్ భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.

దీని ముఖ్య విశేషాలు:

52 భారతీయ భాషలకు మద్దతు
వాయిస్ కమాండ్ ద్వారా నావిగేషన్
వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవడం
ఫోన్ కాల్స్ నిర్వహించడం
సంగీతాన్ని నియంత్రించడం
వాహనానికి సంబంధించిన పలు స్మార్ట్ ఫంక్షన్లను వాయిస్‌తో ఆపరేట్ చేయడం
టాప్ ఓవర్‌ల్యాండ్ ట్రిమ్ ఆధారంగా తయారీ

జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్‌ను కంపెనీ టాప్-స్పెక్ ఓవర్‌ల్యాండ్ ట్రిమ్ ఆధారంగా రూపొందించింది. ఇందులో ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో.. 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్, 170 hp పవర్, 350 Nm టార్క్, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఐచ్ఛిక 4×4 డ్రైవ్ సిస్టమ్ అందుబాటులో ఉంటాయి.

ధర ఎంత?

జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.36.05 లక్షలు. ఇది సాధారణ ఓవర్‌ల్యాండ్ ట్రిమ్‌తో పోలిస్తే రూ.44,000 ఎక్కువ. అయితే ప్రత్యేక డిజైన్, AI అసిస్టెంట్, లిమిటెడ్ ఎడిషన్ హోదా కారణంగా ఈ అదనపు ధరను సమర్థించేలా కంపెనీ ఫీచర్లను అందించింది.

కేవలం 85 యూనిట్లే

ఈ స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ కేవలం 85 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అందువల్ల జీప్ అభిమానులు, లిమిటెడ్ ఎడిషన్ వాహనాలను ఇష్టపడే కొనుగోలుదారులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.