Site icon NTV Telugu

ప్రీమియం టచ్, పెర్ల్ సైరన్ బ్లూ కలర్‌, కొత్త లుక్‌తో మార్కెట్‌లోకి Honda Shine 125 Limited Edition..

Honda Shine

Honda Shine

Honda Shine 125 Limited Edition: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తన పాపులర్ కమ్యూటర్ బైక్ Shine 125కు ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ ను మౌనంగా ఆవిష్కరించింది. స్టైలింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. షైన్ లైనప్‌కు మరింత ఆకర్షణను జోడించడమే లక్ష్యంగా ఈ కొత్త ఎడిషన్‌ను రూపొందించింది. త్వరలోనే ఇది భారత మార్కెట్‌లో విక్రయాలకు అందుబాటులోకి రానుంది.

Read Also: Thammareddy : కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరు మాటల పై..తమ్మారెడ్డి బోల్డ్ స్టేట్‌మెంట్

కొత్త స్టైలింగ్ హైలైట్:
Shine 125 Limited Edition యొక్క ప్రధాన ఆకర్షణ దాని కొత్త డిజైన్, రంగు ఎంపిక. ఈ బైక్‌ను పూర్తిగా కొత్త Pearl Siren Blue కలర్‌లో అందిస్తున్నారు. దీనికి డార్క్ బ్లూ బాడీ ప్యానెల్స్, ఫ్యూయల్ ట్యాంక్‌పై ప్రత్యేకమైన Shine గ్రాఫిక్స్ మరింత ప్రీమియం లుక్‌ను అందజేస్తుంది. ఫ్రంట్ విజర్, సైడ్ కవర్, రియర్ కౌల్‌లపై కూడా కొత్త డిజైన్ టచ్ కనిపిస్తుంది. ప్రత్యేకంగా బ్రౌన్ ఫినిష్ అలాయ్ వీల్స్ ఈ బైక్‌ను సాధారణ Shine 125 Disc వేరియంట్‌తో పోలిస్తే ప్రత్యేకంగా ఉంది.

ఇంజిన్ & పనితీరు:
మెకానికల్‌గా చూస్తే, Shine 125 Limited Editionలో ఎలాంటి మార్పులు లేవు. ఇది Shine 125 Disc మోడల్‌లో ఉన్న అదే ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఈ బైక్‌లో
* 123.94cc BS6 కంప్లయింట్ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్
* 10.6 హెచ్‌పీ పవర్ @ 7,500 rpm
* 11 Nm టార్క్ @ 6,000 rpm ఉత్పత్తి
* 5-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. దీంతో స్మూత్ రైడింగ్‌తో పాటు మంచి మైలేజ్ ఇవ్వడంలో ఈ బైక్ కి పేరుంది.

Read Also: Pat Cummins: టీ20 వరల్డ్‌కప్ 2026కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. టీం నుంచి ప్యాట్ కమిన్స్ ఔట్!

సస్పెన్షన్:
* Shine 125 Limited Edition బైక్
* కర్బ్ వెయిట్: 113 కిలోలు
* సీట్ హైట్: 791 mm
* ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం: 10.5 లీటర్లు
* పొడవు: 2,046 mm
* వెడల్పు: 741 mm
* ఎత్తు: 1,116 mm
* వీల్‌బేస్: 1,285 mm
* గ్రౌండ్ క్లియరెన్స్: 162 mm
* ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్
* వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్స్.. ఇవి నగర రోడ్లపై సౌకర్యవంతమైన రైడ్‌ను అందిస్తాయి.

ధర అంచనా:
హోండా ఇప్పటి వరకు Shine 125 Limited Edition అధికారిక ధరను మాత్రం ప్రకటించలేదు. అయితే, ఇది సాధారణ Shine 125 Disc (ఎక్స్-షోరూమ్ ధర రూ. 85,211) కంటే సుమారు రూ. 1,500 ఎక్కువగా ధర ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, కొత్త లుక్‌తో, ప్రీమియం టచ్‌తో వచ్చే ఈ లిమిటెడ్ ఎడిషన్ షైన్ 125 కమ్యూటర్ బైక్ ప్రేమికులను ఆకట్టుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Exit mobile version