Harley Davidson X440T: హార్లే డేవిడ్సన్ భారత మార్కెట్‌లో తన రెండో అతి చిన్న మోటార్ సైకిల్‌ను ప్రవేశపెట్టింది. Harley Davidson X440Tని టాంచ్ చేసింది. X440 మాదిరిగానే అదే ప్లాట్‌ఫారమ్ ఆధారంగా X440Tని నిర్మించారు. బైక్ డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు. అయితే, కొత్తగా లాంచ్ అయిన X440T, X440 ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. మెరుగైన సీటింగ్ సౌకర్యం కోసం సీటును కొత్తగా రూపొందించారు. ప్యాసింజర్ కోసం పెద్ద గ్రాబ్ హ్యాండిల్స్ కలిగి ఉంది. పెర్ల్ బ్లూ, పెర్ల్ రెడ్, వివిద్ బ్లాక్, పెర్ల్ వైట్ రంగుల్లో ఈ బైక్ రాబోతోంది.
Read Also: Kia EV2: సంచలనానికి సిద్ధమవుతున్న కియా.. మినీ ఎలక్ట్రిక్ SUV, EV2ను విడుదల చేయబోతోంది.. 480KM రేంజ్
బైక్ ట్యాంక్‌పై X440T బ్రాండింగ్ , రేసింగ్ పిన్‌స్ట్రైప్ ఉన్నాయి. బార్ ఎండ్ మిర్రర్స్, బ్లాక్ ఫ్రంట్ ఫెండర్, సింగిల్ సైడ్ ఎగ్జాస్ట్‌లో చిన్న రీడిజైన్ ఉంటుంది. మెకానికల్ అంశాలను పరిశీలిస్తే, రైడ్-బై-వైర్ కంట్రోల్‌తో కూడిన ఎలక్ట్రానిక్ థొరెటల్ బాడీ, ట్రాక్షన్ కంట్రోల్, స్విచెబుల్ రియర్ ABS కలిగి ఉంది. ఇది రోడ్, రెయిన్ రైడింగ్ మోడ్స్ కలిగి ఉంది. వెనకాల టెయిల్ ల్యాంప్‌లను ఫ్లాష్ చేసే పానిక్ బ్రేకింగ్ అలర్ట్ సేఫ్టీ ఫీచర్ మెరుగుపరిచారు.
