Site icon NTV Telugu

Electric Scooter: మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తున్న EOX ZUKI ఎలక్ట్రిక్ బైక్

Untitled Design (17)

Untitled Design (17)

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లోకి ఎన్నో ఎలక్ట్రిక్ బైక్ లు వస్తున్నాయి. అయితే పెరిగిన డీజిల్, పెట్రోల ధరల దృష్ట్యా… ప్రజలు ఈ ఎలక్ట్రిక్ బైక్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. మార్కెట్లోకి వస్తున్న ఈ ఎలక్ట్రిక్ బైక్ లు చాలా ధరల్లోనే మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో EOX ZUKI స్కూటర్ ని లాంచ్ చేశారు.

Read Also: Caffeine Benefits: కెఫిన్ తగిన మోతాదులో తీసుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా..

ప్రస్తుతం భారత దేశంలో ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి స్తున్నాయి. అయితే EOX ZUKI ఎలక్ట్రిక్ స్కూటర్ కి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. దీని వేగం గంటకు 25 కి.మీ. అందుకే ఈ బైక్ లకు ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదని కంపెనీ యాజమాన్యం తెలిపింది. వీటిని ఈఎంఐలో తీసుకుంటే ప్రతి నెల తక్కువ ఈఎంఐలతో చెల్లించవచ్చని వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 40 నుండి 50 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని.. ఇది 48 V లిథియం-అయాన్ బ్యాటరీ, ఛార్జర్‌తో నడుస్తుందని కంపెనీ యాజమాన్యం పేర్కొన్నది.

Read Also: Woman Conductor: హ్యట్సాఫ్ మేడం.. చంటి బిడ్డతో ఎత్తుకుని.. డ్యూటీ చేస్తున్న మహిళా కండకర్ట్

బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4 నుండి 6 గంటలు పడుతుందని.. . దీన్ని సులభంగా తీసి ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ సిబ్బంది ఒకరు తెలిపారు. అయితే.. ఇది వాటర్, ఫైర్ సేప్టీని కలిగి ఉంటుందన్నారు. దీనిలో మొత్తం అనే ఎకో, స్పోర్ట్స్, హై మూడు రకాల డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం దీని ధర విషయానికి వస్తే.. మార్కెట్ లో దీని విలువ 59,999 గా నిర్ణయించారు. అమెజాన్ లో మాత్రం 25శాతం తగ్గింపుతో 44,999లకే ఈ బైక్ అందిస్తున్నారు. క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి దాదాపు 3వేల రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారు. మీరు దీన్ని ఈఎంఐ ద్వారా తీసుకుంటే.. నెలకు 2,182 కట్టుకుంటే సరిపోతుందని.. యాజమాన్యం చెప్పుకొచ్చింది.

Exit mobile version