EV sector: కేంద్ర బడ్జెట్ 2025లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలు(EV) పరిశ్రమలో లిథియం అయాన్ బ్యాటరీలు కీలకంగా ఉంటాయి. ఈ బ్యాటరీ తయారీలో ఉపయోగించే కీలకమై ఖనిజాలు, వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం (BCD)ని తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. ఈ చర్య ద్వారా లిథియం అయాన్ బ్యాటరీల తయారీని మరింతగా పెంచడంతో పాటు వాటి ఇన్‌పుట్ ఖర్చులను కూడా తగ్గిస్తుందని భావిస్తున్నారు. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల ధరల్లో బ్యాటరీలు 35-40 శాతం వరకు ఉంటాయి. దీంతో తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గగలవు.
Read Also: Honda City Apex Edition: మార్కెట్ లోకి హోండా సిటీ అపెక్స్ లిమిటెడ్ ఎడిషన్.. ధర ఎంతంటే?
బ్యాటరీల తయారీకి వాడే కోబాల్ట్ పౌడర్ దాని వ్యర్థాలను, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్ మరో కీలకమైన 12 కీలమైన ఖనిజాలను పూర్తిగా కస్టమ్స్ సుంకం నుంచి మినహాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది దేశంలో బ్యాటరీల లభ్యతను పెంచడంతో పాటు మన యువతకు ఈ రంగంలో ఉద్యోగాలను సృష్టించడానికి సాయపడుతుందని చెప్పారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ల బ్యాటరీ ధరల్ని తగ్గిస్తుంది. ఫలితంగా ఈ రెండు ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి.
EV బ్యాటరీల తయారీకి సంబంధించిన 35 అదనపు మూలధన వస్తువులపై BCDని కూడా ప్రభుత్వం తొలగించింది. వీటిలో పౌడర్ డ్రైయర్, ఆటోమేటిక్ ఫీడింగ్ మరియు బ్లెండింగ్ సిస్టమ్, స్లర్రీ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్, కాథోడ్/యానోడ్ ఎక్స్‌ట్రూషన్ కోటింగ్ మెషిన్, నెగటివ్ ఎలక్ట్రోడ్ ఆటోమేటిక్ ప్రొడక్షన్/ప్లేట్ మెషిన్, పూర్తిగా/సెమీ-ఆటోమేటిక్ వైండింగ్ మెషిన్, ఎలక్ట్రోడ్ స్లిటింగ్ మెషిన్, ఎలక్ట్రోలైట్/హీలియం ఇంజెక్షన్ మెషిన్, సెల్ బేకింగ్ మరియు కూలింగ్ మెషిన్ మరియు నెయిల్ పుల్లింగ్/ఇన్సర్టింగ్ మెషిన్ ఉన్నాయి.