Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్

  • భారత ఈవీ మార్కెట్లో కొత్త విప్లవం
  • టాటా నానో కంటే చౌకైన EV కారు
  • 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
Blink Mobility

Blink Mobility

గురుగ్రామ్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ బ్లింక్ మొబిలిటీ (Blink Mobility) భారత ఈవీ మార్కెట్లో కొత్త విప్లవానికి సిద్ధమవుతోంది. కంపెనీ ప్రస్తుతం ఒక ప్రత్యేక మైక్రో ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తోంది. ఈ కారు 250 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను అందించడమే కాకుండా, కేవలం 2 నిమిషాల 48 సెకన్లలో బ్యాటరీ స్వాప్ సదుపాయాన్ని కలిగి ఉండటం విశేషం. నగర ప్రాంతాల్లో ప్రయాణించే వినియోగదారులు, క్యాబ్, ఫ్లీట్ ఆపరేటర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారును రూపొందిస్తున్నారు.

తక్కువ ధరలో ఈవీ కారు

బ్లింక్ మొబిలిటీ ఈ మైక్రో ఈవీని మూడు చక్రాల వాహనాల ధరలకు సమానంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌ను ఉపయోగించడం ద్వారా వాహన ధరను 40 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే ఈ కారు రోడ్ టెస్టింగ్‌ను పూర్తి చేసుకోగా, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల నెట్‌వర్క్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

×
×
Ad

డిజైన్, ఇంటీరియర్ ఆకర్షణ

బ్లింక్ మైక్రో ఈవీ డిజైన్ పరంగా టాటా నానోను గుర్తు చేస్తుంది. LED హెడ్‌ల్యాంప్స్, గ్లోస్ బ్లాక్ ఫ్రంట్ ప్యానెల్, కంపెనీ లోగోతో ఆధునిక రూపాన్ని సంతరించుకుంది. ప్రత్యేక కాంపోజిట్ మెటీరియల్స్‌తో తయారైన బాడీ ప్యానెల్స్ వాహనాన్ని తేలికగా, బలంగా తయారు చేస్తాయి. స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ కారు రద్దీ నగర రహదారులపై సులభంగా నడిచేలా ఉంటుంది.

ఇంటీరియర్‌లో ఐదుగురు ప్రయాణికులు సౌకర్యంగా కూర్చునే అవకాశం ఉంటుంది. విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన సీట్లు, మెరుగైన స్టోరేజ్ స్పేస్‌తో కుటుంబ అవసరాలు, ఫ్లీట్ వినియోగానికి అనుకూలంగా రూపొందించారు.

ఫీచర్లు, భద్రత

ఈ కారులో పలు ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి.

పవర్ స్టీరింగ్
ఎయిర్ కండిషనింగ్
టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
బ్యాటరీ సేవర్ మోడ్
బ్యాటరీ స్వాప్, ప్లగ్-ఇన్ ఛార్జింగ్ సపోర్ట్
AI ఆధారిత స్మార్ట్ టెక్నాలజీ

భద్రత కోసం నాలుగు-పాయింట్ల సీట్ బెల్ట్స్, ABS, హిల్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, క్రాష్ అబ్సార్బింగ్ స్ట్రక్చర్ వంటి ఫీచర్లు అందించారు.

250 కి.మీ రేంజ్

బ్యాటరీ సామర్థ్యంపై కంపెనీ ఇంకా అధికారిక సమాచారం వెల్లడించలేదు. అయితే బ్యాటరీ స్వాప్ చేసిన తర్వాత వాహనం 252 కిలోమీటర్ల వరకు రేంజ్ చూపించినట్లు సమాచారం.

ఈ కారులో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ. సంప్రదాయ ఛార్జింగ్ కోసం గంటల సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, కేవలం 2 నిమిషాల 48 సెకన్లలో బ్యాటరీని మార్చుకుని ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. భారతదేశంలో ఈవీల వినియోగానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఛార్జింగ్ సమయ సమస్యకు బ్లింక్ మొబిలిటీ కొత్త పరిష్కారం చూపించాలని లక్ష్యంగా పెట్టుకుంది.