Triumph Bonneville T120: భారత్‌లో లాంచ్ అయిన ట్రయంఫ్ బోనేవిల్ T120.. రెట్రో డిజైన్‌ ధర, ఫీచర్లు ఇవే

  • ట్రయంఫ్ బోనేవిల్ T120
  • నయా-రెట్రో బైక్ ధరను రూ. 12.17 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది
  • కొత్త ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీ అప్‌డేట్లు
2026 Triumph Bonneville T12

2026 Triumph Bonneville T12

బ్రిటిష్ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ బోనేవిల్ ఇండియా భారత మార్కెట్లో 2026 Bonneville T120ను అధికారికంగా విడుదల చేసింది. ఈ నయా-రెట్రో బైక్ ధరను రూ. 12.17 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. పాత మోడల్‌తో పోలిస్తే సుమారు రూ. 30,000 పెరిగినప్పటికీ, ఇందులో కొత్త ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీ అప్‌డేట్లు అందుబాటులోకి వచ్చాయి.

డిజైన్‌లో క్లాసిక్ లుక్

2026 Bonneville T120 తన క్లాసిక్ బ్రిటిష్ స్టైలింగ్‌ను కొనసాగిస్తూ, మరింత ప్రీమియం ఫినిష్‌తో వచ్చింది. రౌండ్ LED హెడ్‌ల్యాంప్, క్రోమ్ ఎలిమెంట్స్, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, వైర్-స్పోక్ వీల్స్ ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొత్త హెడ్‌లైట్ డిజైన్‌తో పాటు కొన్ని కాస్మెటిక్ మార్పులు కూడా చేశారు.

ఇంజిన్, పనితీరు

ఈ బైక్‌లో 1200cc లిక్విడ్-కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ బలమైన టార్క్, స్మూత్ పవర్ డెలివరీతో దీర్ఘ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేసిన ఈ ఇంజిన్ క్లాసిక్ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

కొత్త ఫీచర్లు ఏమిటి?

2026 మోడల్‌లో IMU-ఆధారిత రైడర్ ఎయిడ్స్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. దీంతో:

Cornering ABS
Traction Control
Cruise Control
Ride Modes వంటి ఆధునిక ఫీచర్లు మరింత మెరుగ్గా పనిచేస్తాయి.

ఇతర Bonneville మోడళ్లూ లాంచ్

Bonneville T120తో పాటు Triumph సంస్థ కొత్త Bobber, Speedmaster మోడళ్లను కూడా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇవన్నీ కంపెనీ “Unleashed 2026” క్యాంపెయిన్‌లో భాగంగా వచ్చాయి.