Tata Nexon facelift: టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 2023 కార్ లాంచ్ అయింది. ఎంతో మంది ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. గురువారం టాటా తన ప్రతిష్టాత్మక నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ రేట్లను ప్రకటించింది. ఇండియాలోనే సేఫెస్ట్ కార్ గా, గ్లోబల్ NCAP రేటింగ్స్ లో 5 స్థార్ సాధించిన తొలికారుగా నెక్సాన్ కి పేరుంది. గతం మోడళ్లలో పోలిస్తే తాజా న్యూ అవతార్ లో వస్తున్న నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో ఫుల్లీ లోడెడ్ టెక్ ఫీచర్లను తీసుకువస్తోంది టాటా మోటార్స్. గత రెండేళ్లుగా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లో టాప్ పొజిషన్ లో ఉన్న నెక్సాన్, ఇప్పుడు కొత్త రూపంలో అదే దూకుడు కంటిన్యూ చేయాలని అనుకుంటోంది.
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్, ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 300 కార్లకు పోటీ ఇవ్వనుంది. టాటా నెక్సాన్ ఓల్డ్ వెర్షన్ తో పోలిస్తే కొత్తగా వచ్చిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లలో ధరలను పెద్దగా పెంచలేదు.
వేరియంట్ల వారీగా ధరలు(ఎక్స్-షొరూం) ఇవే:
2023 టాటా నెక్సాన్ 1.2-లీటర్ పెట్రోల్ MT
స్మార్ట్ – రూ. 8.10 లక్షలు
స్మార్ట్+ – రూ. 9.10 లక్షలు
ప్యూర్ – రూ. 9.70 లక్షలు
క్రియేటివ్ – రూ. 11 లక్షలు
క్రియేటివ్+ – రూ. 11.70 లక్షలు
ఫియర్‌లెస్ – రూ.12.50 లక్షలు
ఫియర్‌లెస్+ – రూ. 13 లక్షలు
(2023 టాటా నెక్సాన్ 1.2-లీటర్ పెట్రోల్ AMT)
క్రియేటివ్ – రూ. 11.70 లక్షలు
(2023 టాటా నెక్సాన్ 1.2-లీటర్ పెట్రోల్ DCA)
క్రియేటివ్ – రూ. 12.20 లక్షలు
(2023 టాటా నెక్సాన్ 1.5-లీటర్ డీజిల్ MT)
ప్యూర్ – రూ. 11 లక్షలు
(2023 టాటా నెక్సాన్ 1.5-లీటర్ డీజిల్ AMT)
క్రియేటివ్ – రూ. 13 లక్షలు
Tata Nexon facelift and Nexon EV facelift launched at ₹8.10 lakh and ₹14.74 lakh ex-showroom, respectively. pic.twitter.com/9yWUyrUr21
— Auto News India (ANI) (@TheANI_Official) September 14, 2023
అదిరిపోయే ఫీచర్లు..
లోపల డాష్ బోర్డు డిజైన్ చాలా వరకు మారింది. 10.25 ఇంచ్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ కార్ ఫ్లే, ఆపిల్ కార్ ఫ్లేలను సపోర్ట్ చేస్తుంది. లెథెరెట్ ఫ్రంట్ సీట్లు విత్ ఆర్మ్ రెస్ట్, వెంటిలేటెడ్ సీట్లు కొత్త నెక్సాన్ లో ఉన్నాయి. వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, వైర్ లెస్ ఛార్జెర్ ఫీచర్లు ఉన్నాయి.
భద్రత విషయంలో నెక్సాన్ 5 స్టార్ NCAP రేటింగ్ సాధించింది. భారత దేశంలోనే అత్యంత సేఫ్టీ కలిగిన కారుగా పేరుంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో 360-డిగ్రీల సరౌండ్ వ్యూ సిస్టమ్, బ్లైండ్ వ్యూ మానిటర్, ESP, TPMS, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లతో కూడిన ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు కార్నరింగ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ఇంజన్ వివరాలు..
కొత్త నెక్సాన్ లో Revotron 1.2-లీటర్ టర్బో పెట్రోల్ (120PS/170Nm) మరియు Revotorq 1.5-లీటర్ డీజిల్ (115PS/260Nm) ఇంజిన్‌ల ఆప్షన్లను కొనసాగిస్తోంది. ఉపయోగించడం కొనసాగిస్తోంది. పెట్రోల్ ఇంజన్ ఇంతకుముందు 6-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ AMT ఆప్ఫన్లు ఉండగా.. కొత్త 5-స్పీడ్ MT మరియు 7-స్పీడ్ DCA ఇంజన్ ఆప్షన్లతో వస్తోంది. డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ AMT ఆప్షన్లు ఉన్నాయి.