Site icon NTV Telugu

రేపే జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక.. ఛైర్మన్ల ఫైనల్‌ లిస్ట్ ఇదే..

ys jagan

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటింది వైసీపీ.. ఇప్పటికే మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా.. రేపు జడ్పీ ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది.. ఉదయం పది గంటలలోపు ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.. ఉదయం పది నుంచి ఒంటి గంట లోపు స్క్రూటినీ, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఎన్నిక ఉండనుండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్షన్ సభ్యుల ప్రమాణస్వీకారం.. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్‌, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు.

ఇక, జడ్పీ ఛైర్మన్లను, వైస్ ఛైర్మన్లను ఇప్పటికే ఖరారు చేసింది అధికార వైసీపీ..

  1. శ్రీకాకుళం – పిరియా విజయ
  2. విజయనగరం – మజ్జి శ్రీనివాసరావు
  3. విశాఖపట్నం – ముంచంగిపట్టు జడ్పీటీసీ అరిబీరు సుభద్ర
  4. తూర్పుగోదావరి-విప్పర్తి వేణుగోపాల్‌
  5. పశ్చిమగోదావరి – కవురు శ్రీనివాస్‌
  6. కృష్ణా – ఉప్పాళ్ల హారిక
  7. గుంటూరు – క్రిస్టినా
  8. ప్రకాశం – బూచేపల్లి వెంకాయమ్మ
  9. నెల్లూరు – ఆనం అరుణమ్మ
  10. కడప – ఆకేపాటి అమర్నాథరెడ్డి
  11. కర్నూలు – సంధ్యామల జడ్పీటీసీ రామ సుబ్బారెడ్డి (తాత్కాలికం)
  12. చిత్తూరు – వి. శ్రీనివాసులు
  13. అనంతపురం – గిరిజ
Exit mobile version