NTV Telugu Site icon

టీడీపీ, ఆ పార్టీ చీఫ్‌పై ఈసీకి ఫిర్యాదు..

స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. ఏపీ రాజకీయాల్లో హీట్‌ పెంచుతున్నాయి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ.. ఏ విషయం వదలకుండా విమర్శలు, ఆరోపణలు గుప్పించుకోవడమే కాదు.. ఫిర్యాదుల వరకు వెళ్లింది.. తాజాగా.. టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది వైసీపీ.. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పుడు ప్రకటనలతో ఓటర్లను మభ్యపెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్ను మినహాయింపు అంటూ టీడీపీ చేపట్టిన క్యాంపైన్ పై వైసీపీ అభ్యంతరం తెలిపింది.. మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ కు వచ్చే రిజిస్టర్డ్ కోడ్ చూపాలని టీడీపీ ప్రచారం చేస్తోందని.. జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలైతే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే భ్రమను ఓటర్లలో కలిగించే ప్రయత్నం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు వైసీపీ నేతలు.. వెంటనే టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.. మరోవైపు ఇదే అంశంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు వైసీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్.