YS Rajasekhara Reddy Vardhanthi: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో తమ కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆ తర్వాత మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు జగన్.. ఆయనతో పాటు.. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కోడలు వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు..
Read Also: GST Collection: ప్రభుత్వ ఖజానాను నింపిన జీఎస్టీ.. ఆగస్టులో రూ. 1.86 లక్షల కోట్ల వసూళ్లు
ఇక, పులివెందుల సబ్ జైల్లో ఉన్న వైసీపీ నేతలను పరామర్శించనున్నారు వైఎస్ జగన్.. అంబకపల్లెలో ఎంపీ నిధులతో నిర్మించిన గంగమ్మ చెరువులో జలహారతి ఇవ్వనన్నారు.. రేపు ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు బయల్దేరి వెళ్లనున్నారు వైఎస్ జగన్.. మరోవైపు, ఇవాళ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వైసీపీ శ్రేణులు.. తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమంలో ఆ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్య నేతలు పాల్గొననున్నారు.. నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాజమండ్రిలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.. రాజమండ్రి సిటీ, రాజానగరాలలో జరిగే వైఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొంటారు..
Read Also: Astrology: సెప్టెంబర్ 2, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏం చేయాలి..?
మరోవైపు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించనున్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాటు వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించనుంది.. ఉదయం ఎనిమిది గంటలకు వైఎస్సార్ ఘాట్ చేరుకోనున్న షర్మిల.. వైఎస్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించనున్నారు..
