Kadapa Tragedy: ఏ కష్టం వచ్చిందో ఏమో ఆ కుటుంబం మొత్తం ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప నగరంలో చోటు చేసుకుంది. ఏడాది శిశువుతో కలిసి భార్యాభర్తలు గూడ్స్ రైలు కింద పడి సూసైడ్ చేసుకున్న ఘటన అందరిని తీవ్రంగా కలిసి వేస్తుంది. కడప నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుంతకల్ నుంచి రేణిగుంటకు వెళ్తున్న గూడ్స్ ట్రైన్ కింద పడి శ్రీరాములు, శిరీష, రిత్విక్ అనే కుటుంబ సభ్యులు చనిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, కడప నగరంలోని శంకరాపురానికి చెందిన వారిగా మృతులను రైల్వే పోలీసులు గుర్తించారు. ఇక, పోస్టుమార్టం నిమిత్తం మూడు మృతదేహాలను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Read Also: Smriti Mandhana: తొలి బ్యాటర్‌గా స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు!
అయితే, భార్యాభర్తలు శ్రీరాములు- శిరీష గొడవ పడుతుండటంతో నానమ్మ సుబ్బమ్మ మందలించింది. దీంతో ఇంటి నుంచి భార్య శిరీష, కొడుకు రిత్విక్ తో శ్రీరాములు వెళ్లిపోయాడు. మనవడు భార్య పిల్లలతో వెళ్ళిపోగానే నానమ్మ గుండె పోటుకు గురైంది. ఇక, భార్యా, కొడుకుతో శ్రీరాములు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
