Site icon NTV Telugu

YSR Aarogyasri : నిరుపేదల గుండెచప్పుడు ఆరోగ్యశ్రీ

Arogyasri

Arogyasri

గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకానికి వైసీపీ సర్కార్ ఊపిరిలూదుతోంది. నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఎంతో అండగా నిలుస్తోంది. వారికి ఖరీదైన వైద్యం పైసా ఖర్చులేకుండా అందించి జీవితంపై భరోసా కల్నిస్తోంది. గుండె, కాలేయం, కిడ్నీ, క్యాన్సర్‌ ఇలా ఎన్నో రకాల పెద్ద జబ్బులకు నయా ఖర్చు లేకుండా ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ పథకం ఏపీలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సైతం పేదలకు ఈ పథకం ద్వారా ఉచితంగా చికిత్స అందుతోంది. వారంతా వైద్యం తర్వాత చిరునవ్వుతో ఇంటికి తిరిగొస్తున్నారు.

ఈ పథకం ద్వారా కేవలం 18నెలల్లో 73,856మంది చికిత్స అందించారు. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 సెప్టెంబర్‌ 30 వరకూ 18 నెలల్లో రాష్ట్రంలో 73,856 మంది ఆరోగ్యశ్రీ కింద గుండె జబ్బులకు చికిత్స పొందారు. వీరిలో 21,740 మంది మహిళలు, 52,116 మంది పురుషులు ఉన్నారు. వీరి చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.378 కోట్లు ఖర్చు చేసింది. 2021–22లో రూ.233 కోట్లు వెచ్చించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.145 కోట్లు వెచ్చించింది. మరోవైపు చికిత్స పొందిన వారికి ఆరోగ్య ఆసరా పథకం కింద విశ్రాంత సమయానికి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఈ పథకం ద్వారా అర్హులందరికీ ఉచితంగా గుండె, కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తులు సంబంధిత పెద్ద వ్యాధులతోపాటు క్యాన్సర్‌ వంటి జబ్బులకు సైతం ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం వైద్యం చేయిస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో 2,446 చికిత్సలకు వైద్యం అందుతుండగా.. త్వరలో ఆ సంఖ్య 3,254కు పెరగనుంది.

Exit mobile version