Site icon NTV Telugu

వివేకా కేసులో ఆయుధాల కోసం కోనసాగుతున్న మూడవ రోజు అన్వేషణ…

మాజీ మంత్రి వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం రెండు ప్రాంతాల్లో మూడవ రోజు అన్వేషణ కొనసాగుతుంది. పులివెందులలోని రోటరీపురం వాగు, తూర్పు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని గరండాల వంకలో అన్వేషిస్తున్నారు . నిన్న వాచ్ మెన్ రంగన్న, ప్రకాష్ రెడ్డి, ఇనాయతుల్లా, వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు శివ ప్రకాష్ లను విచారించిన సీబీఐ అధికారులు.. అనంతరం మరో కోత్త ప్రాంతంలో ఆయుధాల కోసం అన్వేషణ ప్రారంభించారు. వ్యర్థాలను తొలగిస్తున్నారు ఇరవై మంది మున్సిపల్ సిబ్బంది. వంకలో బురద ఎక్కువగా ఉండడంతో ఇబ్బందికరంగా మారింది అన్వేషణ. నిన్న మధ్యాహ్నం జెసీబీ యంత్రంతో వ్యర్థాలను తొలగించిన సీబీఐ అధికారులు… మూడవ రోజు మళ్ళీ రంగంలోకి దిగి పారిశుద్ధ్య కార్మికులతో మరో కోత్త ప్రాంతంలో అన్వేషణ చేస్తున్నారు. కడప రైల్వే స్టేషన్ మేనేజర్ మోహన్ రెడ్డి సాక్షిగా కొనసాగుతుంది అన్వేషణ. అయితే నిన్న సీబీఐ అధికారులను కలిశారు వైఎస్ వివేకా కుమార్తె సునీతమ్మ, అల్లుడు రాజశేఖర్ రెడ్డి.

Exit mobile version