YS Jagan Setairs Chandrababu: ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై నాణేనికి రెండవ వైపున జరిగే అంశాలను వివరించే ప్రయత్నం చేస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మూడు అంశాలు ఇవాళ చెప్పబోతున్నాం.. రైతుల ఎరువుల సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలసి అన్నదాత పోరు కార్యక్రమం, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై చంద్రబాబు అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాలపై ఆయన చెప్పిన అబద్ధాలను మీకు తెలియజేస్తున్నాన్నారు.
Read Also: Nepal: ఆర్మీ చేతుల్లోకి నేపాల్.. కొనసాగుతున్న కర్ఫ్యూ
అయితే, సీఎం చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలోనే రైతులు ఎరువుల కోసం క్యూలైన్లు కట్టారు అని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ అవమానం భరించలేక చంద్రబాబు దేంట్లోనైనా దూకి చావొచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పాలనలో ఎరువుల కోసం రైతులు ఎక్కడైనా రోడ్డెక్కారా?.. ఈ ప్రభుత్వం స్కాంలు చేసి డబ్బులు దండుకోవాలని చూస్తోంది, కాబట్టే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల కోసం వైసీపీ నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసింది.. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు.. రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
