Sri Chaitanya Hostel Ragging: రాజమండ్రిలోని శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని, మరో ఇద్దరు స్టూడెంట్స్ పైశాచికంగా వేధించారు. 10 రోజుల క్రితం జరిగదిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌లో ఉన్న సీసీ కెమెరాను ఇద్దరు విద్యార్థులు తీసేయడంతో.. ఆ విషయాన్ని ప్రిన్సిపాల్‌కు చెప్పిన అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన గుర్రం విన్సెంట్ ప్రసాద్‌ను దారుణంగా హింసించారు. అయితే, సీసీ కెమెరా విషయం చెప్పినందుకు ప్రతీకారంగా ఆ ఇద్దరు విద్యార్థులు ఐరన్ బాక్స్‌తో విన్సెంట్ ప్రసాద్ పొట్ట భాగం, చేతులపై విచక్షణ రహితంగా వాతలు పెట్టి.. అతడ్ని తీవ్రంగా గాయపర్చడంతో.. ప్రస్తుతం రాజోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read Also: California: 64ఏళ్ల ఉపాధ్యాయుడికి 215 సంవత్సరాల జైలు శిక్ష.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
అయితే, భయంతో తనకు జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పకుండా బాధిత విద్యార్థి గుర్రం విన్సెంట్ ప్రసాద్ ఉండిపోయాడు. ఇక, తల్లిదండ్రులు కార్పొరేట్ హాస్టల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తుంటే, తమ కుమారుడికి ఇలాంటి పరిస్థితి రావడం దారుణం అని పేర్కొన్నారు. తన కుమారుడు ఎదుర్కొన్న వేధింపులపై తల్లి లక్ష్మీ కుమారి కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై స్టూడెంట్ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
